Site icon NTV Telugu

Rape D OTT: నేరుగా ఓటీటీలోకి క్రైమ్ థ్రిల్లర్ ‘రేప్‌ డీ’ మూవీ

Maxresdefault (2)

Maxresdefault (2)

New Crime Thriller Rape D Premieres Directly on OTT: ఈ మధ్య కాలంలో చాలా సినిమాలు థియేటర్ కంటే ఓటీటీలోకే నేరుగా వచ్చేస్తున్నాయి. కొంతమంది వర్క్ టైం వల్ల మరికొంతమంది థియేటర్ కి వెళ్ళి చూడటం కన్నా ఇంటి దగ్గర చూడటం చాలా బెస్ట్ అని ఓటీటీలో వచ్చిన ఏ సినిమాని కూడా వదలకుండా చూస్తున్నారు. ప్రొడ్యూసర్స్ కూడా ఓటీటీ డిమాండ్ చూసి చిన్న సినిమాలు ఏమైనా ఉంటె డైరెక్ట్ ఓటీటీ లోకి రిలీజ్ చేస్తున్నారు. ఇక తాజాగా ఇదే దారిలో మరో మూవీ మన ముందుకు రాబోతుంది. విశ్వ కార్తికేయ, కారుణ్య చౌదరి హీరో హీరోయిన్లుగా టాలెంట్ కెఫె ప్రొడక్షన్ బ్యానర్ మీద దేవీ మేరేటీ నిర్మించిన చిత్రం ‘రేప్ డీ’.

Also Read:Samantha Dhulipalla: శోభిత చెల్లి సమంత.. నాగచైతన్యతో ఫోటోలు పోస్ట్

సాధ్వి, ప్రణవి సమర్పణలో వైవీ. రమణ మూర్తి, యశ్వంత్ తోట సహ నిర్మాతలుగా తెరకెక్కిన ఈ చిత్రానికి రవి శర్మ దర్శకత్వం వహించారు. ఈ మూవీకి ప్రకాష్ వేద కథ, మాటలను అందించగా వికాస్ కురిమెల్ల సంగీతాన్ని సమకూర్చారు. క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ జానర్‌లో రేప్ డీ చిత్రం రాబోతోంది. ఈ మూవీని నేరుగా ఓటీటీలోకి రిలీజ్ చేయబోతోన్నారు. ఆగస్ట్ 10 నుంచి రెంటల్ బేస్డ్ మీద బీ సీనీ ఈటీ (Bcineet) యాప్‌లో ఈ చిత్రం అందుబాటులో ఉంటుంది. యాన్యువల్ సబ్‌స్క్రిప్షన్‌కి RAPED100 కూపన్ కూడా ఇచ్చారు. ఇక ఈ చిత్రం ఆగస్ట్ 24 నుంచి ఇతర ఓటీటీ సంస్థలోనూ అందుబాటులోకి రానుంది. వంశీ ఆలూర్, నేహాల్ గంగావత్, రవి వర్మ అద్దూరి, అమిక్ష పవార్, వశిష్ట చౌదరి, కిరిటీ దామరాజు, అనుపమ స్వాతి తదితరలు కీలక పాత్రలు పోషిస్తుండగా.. మహేష్ కాసర్ల ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు.

Exit mobile version