NTV Telugu Site icon

Krishnamma OTT: ఎలాంటి ప్రకటన లేకుండా.. వారానికే ఓటీటీలోకి వచ్చేసిన ‘కృష్ణమ్మ’!

Krishnamma Ott

Krishnamma Ott

Satya Dev’s Krishnamma Movie on Amazon Prime Video: టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘కృష్ణమ్మ’. వీవీ గోపాలకృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంను స్టార్ డైరెక్టర్‌ కొరటాల శివ సమర్పణలో అరుణాచల క్రియేషన్స్‌పై కృష్ణ కొమ్మలపాటి నిర్మించారు. ఇందులో సత్యదేవ్‌కు జంటగా అతీరా రాజ్‌ నటించారు. మే 10న థియేటర్లలో విడుదలైన కృష్ణమ్మ సినిమా.. ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. అయితే విడుదలైన వారానికే ఈ చిత్రం ఓటీటీలోకి రావడం విశేషం.

Also Read: Nithish Reddy: తెలుగు ఆటగాడు నితీష్ రెడ్డికి జాక్‌పాట్!

ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా కృష్ణమ్మ ఓటీటీలోకి వచ్చేసింది. మే 16 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో ఈ చిత్రం స్ట్రీమింగ్‌ అవుతోంది. ఉన్నపళంగా ఓటీటీలో రావడంతో సినీ ప్రియులు షాక్ అవుతున్నారు. థియేటర్‌లో చూడని ప్రేక్షకులు కృష్ణమ్మను హాయిగా ఇంట్లోనే ఎంజాయ్ చేస్తున్నారు. కథా నేపథ్యం సాగతీతగా ఉండడమే ఈ సినిమాకు మైనస్ అయింది. సత్యదేవ్‌ నటన, రెండో భాగం ప్రేక్షకులను మెప్పిస్తుంది. స్నేహంతో ముడిపడి ఉన్న ప్రతీకార కథగా కృష్ణమ్మ సాగుతుంది.

Show comments