Site icon NTV Telugu

Kannappa OTT Release: ఓటీటీలో ‘కన్నప్ప’ సినిమా.. ఆలస్యంగా స్ట్రీమింగ్?

Kanappa

Kanappa

Kannappa OTT Release: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిన ‘కన్నప్ప’ (Kannappa) సినిమా చివరికి ఓటీటీలోకి చేరింది. అయితే, చిన్న ట్విస్ట్ కారణంగా నెటిజన్లు కొద్దిసేపు అయోమయం చెందారు. జూన్ 27న థియేటర్లలో విడుదలైన ఈ పాన్‌ఇండియా ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలే ఉన్నాయి. కానీ, బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. అయినా కూడా ఇందులో ఉన్న భారీ తారాగణం, మేకింగ్‌ విజువల్స్ వల్ల ఈ మూవీకి ఓటీటీలో మంచి క్రేజ్ ఏర్పడింది.

IPL Tickets Price: క్రికెట్ లవర్స్ కు బిగ్ షాక్.. ఐపీఎల్ టిక్కెట్లపై 40 శాతం జీఎస్టీ.. కొత్త రేట్లు ఇవే

మంచు విష్ణు స్వయంగా సోషల్ మీడియాలో సెప్టెంబర్ 4నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘కన్నప్ప’ స్ట్రీమింగ్‌ మొదలవుతుందని ప్రకటించారు. అయితే నిర్ణీత సమయానికి సినిమా రాకపోవడంతో నెటిజన్లు ఆశ్చర్యపోయారు. సినిమాకు సంబంధించి ఏమైనా ఇబ్బందులున్నాయా? అంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది. చివరికి అమెజాన్ ప్రైమ్ టీమ్ అధికారిక పోస్టర్ రిలీజ్ చేయడంతో అందరికి క్లారిటీ వచ్చింది. కొద్ది గంటల ఆలస్యంగానైనా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమా స్ట్రీమింగ్ ప్రారంభమైంది.

Lunar Eclipse: చంద్రగ్రహణం రోజున పాటించాల్సిన నియమాలు ఇవే..

ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మంచు విష్ణు టైటిల్ రోల్‌లో కనిపించగా, ప్రభాస్ రుద్ర పాత్రలో, మోహన్‌లాల్ కిరాతగా, అక్షయ్ కుమార్ శివుడిగా, కాజల్ అగర్వాల్ పార్వతిగా నటించారు. ప్రత్యేక పాత్రలో మోహన్ బాబు మహదేవశాస్త్రిగా ఆకట్టుకున్నారు. దాదాపు పదేళ్లుగా విష్ణు కలలుగన్న ఈ ప్రాజెక్ట్ ను భారీ బడ్జెట్‌తో మోహన్ బాబు నిర్మించగా, ఇప్పుడు ఓటీటీలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆలస్యంగా అయినా స్ట్రీమింగ్ ప్రారంభమవ్వడంతో.. సినిమా చూడాలని ఎదురుచూసిన ప్రేక్షకులు ఇప్పుడు అమెజాన్ ప్రైమ్‌లో ఎంజాయ్ చేయనున్నారు. చూడాలిమరి ఓటీటీలో ప్రేక్షకులను ఎంతవరకు కన్నప్ప అలరించగలడో.

Exit mobile version