Site icon NTV Telugu

Honeymoon Express: మరో ఓటీటీలోకి ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’

Honeymoon Express

Honeymoon Express

Honeymoon Express Streaming in Prime Video: చైతన్య రావ్, హెబ్బా పటేల్ జంటగా నటించిన హనీమూన్ ఎక్స్‌ప్రెస్ ఆ మధ్య థియేటర్లలో రిలీజ్ అయింది. ఎప్పుడూ డిఫరెంట్ కాన్సెప్ట్‌లతో ఆడియెన్స్ ముందుకు వచ్చే చైతన్య రావ్ చిత్రాలన్నీ విమర్శకుల ప్రశంసలు అందుకుంటూ ఉన్నాయి. రీసెంట్‌గా వచ్చిన హనీమూన్ ఎక్స్‌ప్రెస్‌కి థియేటర్లోనూ మంచి రెస్పాన్స్ రాగా చైతన్య రావ్, హెబ్బా పటేల్‌ల జంటకు మంచి మార్కులే పడ్డాయి. ఇక ఈ ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’ను కేకేఆర్, బాల రాజ్ నిర్మించగా.. బాల రాజశేఖరుని దర్శకత్వం వహించారు.

ఈ చిత్రానికి కళ్యాణీ మాలిక్ అందించిన సంగీతం స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. సిస్ట్లా వీఎంకే కెమెరా పనితనానికి మంచి మార్కులు పడ్డాయి. ఈ మూవీకి థియేటర్ లో ఎలాంటి రెస్పాన్స్ అయితే వచ్చిందో.. ఓటీటీలో దానికి మించిన రెస్పాన్స్ వస్తోందని మేకర్స్ చెబుతున్నారు. ఇప్పటికే ఒక ఓటీటీలో సందడి చేస్తోన్న ఈ సినిమాను బిగ్ ఫిష్ సినిమాస్ ద్వారా ఈ మూవీ ఆగస్ట్ 27 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ చేశారు మేకర్స్. ఇక అమెజాన్‌లో ఈ మూవీ ఇప్పుడు ట్రెండ్ అవుతోంది. ఇప్పటి కుర్రకారు ఎదుర్కొంటున్న ప్రేమ, పెళ్లి, విడాకులు అనే కాన్సెప్ట్ మీద అందరినీ ఆకట్టుకునేలా చేసిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ ఆడియెన్స్‌ను సైతం కట్టి పడేస్తోందని మేకర్స్ చెబుతున్నారు.

Exit mobile version