The Birthday Boy Now Available on Aha: రవికృష్ణ, సమీర్ మళ్లా, రాజీవ్ కనకాల ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘ది బర్త్ డే బాయ్’. బొమ్మా బొరుసా బ్యానర్ పై ఐ. భరత్ నిర్మాణంలో విస్కీ దాసరి దర్శకత్వం వహించారు. కొత్త కథలను జనాలు ఎక్కువగా ఆదరిస్తున్నారు. మాస్ మసాలా కమర్షియల్ చిత్రాల కంటే కాన్సెప్ట్ బేస్డ్ మూవీస్ ఎక్కువగా సక్సెస్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ది బర్త్ డే బాయ్ అనే చిత్రం వచ్చింది. ఈ మూవీకి థియేటర్లో మంచి రెస్పాన్స్ దక్కింది. ఓ ఐదుగురు స్నేహితుల చుట్టూ జరిగే ఈ కథకు జనాలు ఫిదా అయ్యారు. జులై 19 ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా యూత్‌ను బాగా అలరించింది. ఇప్పుడు ఆహాలోనూ ఈ మూవీ అందరినీ ఆకట్టుకుంటోంది.
Also Read: Pawan Kalyan: పవర్ స్టార్ ఫాన్స్ కి పండగే.. రీరిలీజ్ కాబోతున్న పవర్ ప్యాకెడ్ మూవీ
ఆగస్టు 9 నుంచి ‘ఆహా’లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది. అన్ని రకాల అంశాలను మేళవించి తెరకెక్కించిన ఈ మూవీకి ఇప్పుడు అన్ని వర్గాల ఆడియెన్స్ నుంచి ఆదరణ లభిస్తోంది. ప్రశాంత్ శ్రీనివాస్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకి హైలైట్‌గా చెప్పొచ్చు. కథలోని టెన్షన్, ఎమోషన్‌ని ప్రేక్షకులు ఫీల్ అయ్యేలా చేసింది. సంకీర్త్ రాహుల్ విజువల్స్, కెమెరా పనితనం మనల్ని సినిమాలో లీనమయ్యేలా చేస్తుంది. ఇక ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే… 2016లో దర్శకుడు అమెరికాలో ఉద్యోగం చేస్తున్నప్పుడు తన జీవితంలో జరిగిన సంఘటననే కథగా మలిచి తెరకెక్కించిన చిత్రం ఇది. పుట్టినరోజు వేడుకల్లో ఓ స్నేహితుడు ఎలా చనిపోయాడు? ఆ తర్వాత జరిగిన సంఘటనలు ఎలాంటివనేది చుడాలిసిందే..