NTV Telugu Site icon

OTT Update: బడా ఓటీటీ సంస్థల షాకింగ్ డెసిషన్… టెన్షన్లో టాలీవుడ్ మేకర్స్!

Ott Platforms

Ott Platforms

OTT Giants Shock to Tollywoood: ఒకప్పుడు సినీ నిర్మాతలకి థియేటర్స్ నుండి మాత్రమే ఆదాయం వచ్చేది. ఆ తర్వాత మ్యూజిక్ రైట్స్, శాటిలైట్ రైట్స్ అంటూ అదనపు ఆదాయం వచ్చి చేరగా అది నిర్మాతలకు కొంతలో కొంత బాసటగా ఉండేది. కరోనా పుణ్యమా అని ఓటీటీ ఊపందుకోవడంతో ఇప్పుడు డిజిటల్ రైట్స్ రూపంలో నిర్మాతలు గట్టి లాభాలే వెనకేసుకుంటున్నారు. సినిమా కాంబినేషన్, హీరో హీరోయిన్లు-డైరెక్టర్లకి ఉండే హైప్ ని బట్టి విడుదలకు ముందే ఫ్యాన్సీ ధరలు చెల్లించి ఓటీటీ సంస్థలు డిజిటల్ రైట్స్ దక్కించుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక అంతర్జాతీయ, జాతీయ సంస్థలు మధ్య నెలకొన్న పోటీ వలన సినిమాలను ముందే దక్కించుకోవాలని కూడా ప్రయత్నాలు చేస్తూ ఉండడం కూడా మన నిర్మాతలకు కలిసొస్తుంది. అయితే ఈ పోటీకి పోయి బొక్కబోర్లా పడుతున్న కొన్ని దిగ్గజ ఓటీటీ సంస్థలు ఒక నిర్ణయానికి వచ్చాయని అంటున్నారు.

Rahul Sipligunj: రాహుల్-రతిక ప్రైవేటు ఫొటోలు లీక్.. సింగర్ సంచలన ఆరోపణలు

అదేమంటే తెలుగు సినిమాలను తక్కువ సంఖ్యలో కొనాలని వారు నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. ఇటీవల కొన్ని సినిమాల వలన కలిగిన నష్టాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. ఇప్పుడు హైప్ ఉన్న తెలుగు సినిమాలను దాదాపు ప్రైమ్, నెట్ఫ్లిక్స్ దక్కించుకుంటూ టాలీవుడ్ కంటెంట్ పై ఏడాదికి రూ. 250-300 కోట్లు పెట్టుబడి పెడుతున్నట్లు అంచనా. ఈమధ్య అంచనాలు తప్పి ఇబ్బందిపడడంతో సినిమాల కొనుగోలు స్పీడ్ తగ్గించాలని ఒక నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. అయితే అలా చేయడంతో ఇప్పుడు మేకర్స్ లో కొంత టెన్షన్ క్రియేట్ అవుతోంది. ఎందుకంటే ఓటీటీ అమ్మకాల డబ్బుతో కొందరు నిర్మాతలు సినిమాలు చేసేస్తున్నారు. అంటే సినిమా మీద పెడుతున్న డబ్బు అంతా ఓటీటీలో వచ్చేస్తుండగా థియేటర్, శాటిలైట్ అంతా బోనస్ అనుకునేవారు. కానీ తాజాగా ఓటీటీ సంస్థల నిర్ణయంతో ఇప్పుడు మేకర్స్ టెన్షన్ ఫీల్ అవుతున్నారు.