NTV Telugu Site icon

Big Boss : ఓటీటీ బిగ్ బాస్ విజేత బిందుమాధవి!?

Big Boss

Big Boss

బిగ్ బాస్ ఓటీటీ వెర్షన్, బిగ్ బాస్ నాన్-స్టాప్ కి ఎండ్ కార్డ్ పడుతోంది. ఫైనల్ ఎపిసోడ్ కి రంగం సిద్దం అయింది. ఈ సీజన్ విజేతగా బిందు మాధవి నిలిచినట్లు సమాచారం. బిగ్ బాస్ సీజన్ 4లో రన్నరప్‌ అయిన అఖిల్ సార్థక్ ఓటీటీ వెర్షన్ లో కూడా అదే స్థానానికి పరిమతం అవటం విశేషం. ఇప్పటి వరకూ తెలుగులో బిగ్ బాస్ విజేతగా మహిళలు ఎవరూ నిలవలేదు. తొలి మహిళా విజేతగా బిందు మాధవి చరిత్ర సృష్టించనుందన్నమాట.

 

ఇప్పటి వరకూ వరుసగా శివ బాలాజీ, కౌశల్, రాహుల్ సిప్లిగంజ్, అభిజీత్, సన్నీ బిగ్ బాస్ తెలుగు విజేతలుగా నిలిచారు. గీతా మాధురి శ్రీముఖి మాత్రమే రెండు, మూడు సీజన్లలో సెకండ్ ప్లేస్ లో నిలిచారు. ఇక ఈ ఓటీటీ వెర్షన్ లో శివ మూడవ స్థానంలో, అరియానా నాలుగో స్థానంలో, మిత్రా ఐదో స్థానంలో, బాబా భాస్కర్‌, అనిల్‌ రాథోడ్‌ ఆరు, ఏడో స్థానాల్లో నిలిచారు. అయితే ఈ బిగ్ బాస్ ఓటీటీ వెర్షన్‌ అట్టర్ ప్లాప్ అనిపించుకుంది. ఎందుకో ఏమో కానీ దీనికి ప్రేక్షకాదరణ దక్కలేదు. మరి నిర్వాహకులు ఓటీటీ సెకండ్ సీజన్ నిర్వహిస్తారా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.