NTV Telugu Site icon

Dhanush: ఈ హీరోని చూసి తమిళ హీరోలు చాలా నేర్చుకోవాలి…

Dhanush

Dhanush

రెండు నేషనల్ అవార్డ్ అందుకున్న హీరోగా ధనుష్ కి ఒక క్రెడిబిలిటీ ఉంది. అందరు హీరోలు పాన్ ఇండియా సినిమాలు చేస్తుంటే ధనుష్ మాత్రం, పాన్ ఇండియా భాషల్లో సినిమాలు చేస్తున్నాడు. నార్త్ నుంచి సౌత్ వరకూ కథ నచ్చితే ఎక్కడైనా సినిమాలు చేస్తున్న ధనుష్ వెస్ట్రన్ ఆడియన్స్ ని కూడా మెప్పిస్తున్నాడు. హాలీవుడ్ ప్రాజెక్ట్స్ వరకూ ప్రయాణం చేసిన ధనుష్ మొదటిసారి తెలుగు-తమిళ భాషల్లో నటిస్తున్న మూవీ ‘సార్/వాతి’. సితార ఎంటర్తైన్మెంట్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీ ఫిబ్రవరి 17న ఆడియన్స్ ముందుకి రానుంది. వెంకీ అట్లూరి డైరెక్ట్ చేస్తున్న సార్ సినిమాని ట్రైలర్ రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఈ ట్రైలర్ లాంచ్ కి ధనుష్ హైదరాబాద్ వచ్చాడు. ధనుష్ రావడంతో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ మరింత స్పెషల్ అయ్యింది. నిజానికి కమల్ హాసన్, రజినీకాంత్, కార్తి, సూర్య, విక్రమ్ లాంటి హీరోలు తెలుగులో రిలీజ్ అయ్యే తమ సినిమాల ప్రమోషన్స్ కి హైదరాబాద్ వస్తుంటారు కానీ విజయ్ ఇప్పటివరకూ చెన్నై దాటి ఎక్కడికీ వచ్చి తన సినిమాని ప్రమోట్ చెయ్యలేదు.

ధనుష్ తన మొదటి తెలుగు సినిమాకే హైదరాబాద్ వచ్చి సార్ మూవీని ప్రమోట్ చెయ్యడం గొప్ప విషయం. ఇందులో ఇంకో గొప్ప విషయం ఏంటంటే ధనుష్, ప్రతి సీన్ ని రెండు భాషల్లో నటించడం. బైలింగ్వల్ అనే పదం పేరుకే వాడుతూ ఉంటారు కానీ నిజానికి దాదాపు అన్ని డబ్బింగ్ సినిమాలే. ఒక భాషలో సినిమా చేసి మిగిలిన భాషల్లో డబ్ చేసి రిలీజ్ చేస్తూ ఉంటారు. యంగ్ హీరోల్లో కార్తీ లాంటి నటుడు మాత్రమే తన సినిమాలకి రెగ్యులర్ గా తెలుగు డబ్బింగ్ చెప్తున్నాడు. ధనుష్ మాత్రం బైలింగ్వల్ అనే పదానికి న్యాయం చేస్తూ ప్రతి సీన్ ని తెలుగు-తమిళ భాషల్లో చేశాడు. ఆ పర్ఫెక్షన్ కోసం ధనుష్ అండ్ టీం పెట్టిన ఎఫోర్ట్స్ ట్రైలర్ లో కనిపించాయి. వెంకీ అట్లూరిని మెచ్చుకోవాల్సిందే, టైం వేస్ట్ అవుతుంది అని తెలిసి కూడా ధనుష్ తో తెలుగులో సీన్ చేయించడం గొప్ప విషయం. ఇదే మిగిలిన హీరోలు కూడా నేర్చుకుంటే, ఆడియన్స్ కి తెరపై సీన్ చూసే అప్పుడు డైరెక్ట్ గా కనెక్ట్ అవుతాడు.

Show comments