Site icon NTV Telugu

Actor Vinayakan : మీటూపై అనుచిత వ్యాఖ్యలు… సిస్టర్ అంటూ సారీ చెప్పిన స్టార్

Vinayakan

ఇటీవల విడుదలైన మలయాళ చిత్రం “ఒరుతీ” చిత్రానికి ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభిస్తోంది. ఈ చిత్రంలో కథానాయకుడుగా కన్పించిన వినాయకన్ మీటూ ఉద్యమంపై వివాదాస్పద కామెంట్స్ చేసి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. అయితే తాజాగా ఆయన చేసిన కామెంట్స్ కు క్షమాపణలు చెప్తూ సోషల్ మీడియా వేదికగా నోట్ షేర్ చేశారు. “ఒరుతీ” ప్రెస్‌మీట్‌లో మీడియాతో మాట్లాడుతున్నప్పుడు మీటూ గురించి ప్రశ్న ఎదురైంది. ఓ లేడీ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు వినాయకన్ స్పందిస్తూ మీటూ ఉద్యమం అంటే ఏంటో తనకు తెలియదని, మహిళలను సెక్స్ అడగడం మీటూనా? అని అన్నాడు. దీంతో ఆయన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ‘మీ టూ’పై ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చినందుకు జర్నలిస్టుల నుంచి, సోషల్ మీడియాలో వినాయకన్‌ తీవ్ర ఆగ్రహాన్ని చవిచూడాల్సి వచ్చింది.

Read Also : Mayabazar completes 65 years : మ‌ది దోచిన‌ మ‌హ‌త్త‌ర చిత్రం మాయాబ‌జార్!

తాజాగా వినాయకన్ సదరు జర్నలిస్ట్‌ను ‘సిస్టర్’ అని పిలుస్తూ క్షమాపణ లేఖను రాశారు. వినాయకన్ “అందరికీ నమస్కారం. ‘ఒరుతీ’ ప్రమోషనల్ ఈవెంట్‌లో జర్నలిస్టులలో ఒకరు (సహోదరి) అవమానకరంగా భావించిన నిర్దిష్ట భాషను నేను ఉపయోగించాను. నేను ఆమెను పర్సనల్ గా టార్గెట్ చేయలేదు. ఆ రోజు నేను చేసిన వ్యాఖ్యలు ఆమెకు అసౌకర్యం కలిగించినందుకు హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నాను. వినాయకన్.” అంటూ లేఖను విడుదల చేశారు.

Exit mobile version