Babli Bouncer: ట్రైలర్ తో మారిపోయిన అభిప్రాయం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాన్ ఇండియా యాక్ట్రస్ తమన్నా లేడీ బౌన్సర్‌గా నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘బబ్లీ బౌన్సర్’. జాతీయ అవార్డు గ్రహీత, దర్శకుడు మధుర్ భండార్కర్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని స్టార్ స్టూడియోస్, జంగిలీ పిక్చర్స్ నిర్మించాయి. ఈ మూవీ ఈ నెల 23న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో దర్శకుడు మధుర్ భండార్కర్, హీరోయిన్ తమన్నా మీడియాతో మాట్లాడారు. తొలుత మధుర్ హైదరాబాద్ తో తనకున్న అనుబంధాన్ని చెబుతూ, ”ఈ సిటీతో నాకు చాలా మెమోరీస్ ఉన్నాయి. రాము గారితో కలసి ‘రాత్రి, రంగీలా, గాయం, అంతం, గోవిందా గోవిందా’ సినిమాలకు ఇక్కడే వర్క్ చేశాను. నా మొదటి సినిమా ‘చాందిని బార్’ను హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీ లో తీశాను. ఇరవై మూడు సంవత్సరాల తర్వాత మళ్ళీ హైదరాబాద్ కు రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా విషయానికి వస్తే నార్త్ సైడ్ లో లేడీ బౌన్సర్ లను చూశాను. ఇక్కడ సౌత్ లో ఉండకపోవచ్చు. వారిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఈ సినిమా మెదలుపెట్టాను. ఈ సినిమాలో హీరోయిన్ బబ్లీగా ఉంటూనే, ఫిజికల్ గా, మెంటల్ గా మెచ్యూరిటీ చూపించాలి. ఈ విషయంలో తమన్నా ది బెస్ట్ అనిపించింది. ‘బాహుబలి’లో తమన్నా చేసిన రోల్ ఆమెలోని నటిని బయటకు తీసుకువచ్చింది. దాంతో చాలామంది ఈ పాత్రకు తమన్నాను ఎందుకు తీసుకున్నావ్? అని అడిగారు. వారందరూ ఈ మూవీ ట్రైలర్ చూసిన తరువాత ఫోన్ చేసి మీ ఛాయిస్ నూరు శాతం కరెక్ట్ అని చెప్పారు. మేము అనుకున్నట్టే ఈ సినిమాలో తమన్నా బౌన్సర్ గా చాలా చక్కగా నటించింది” అని అన్నారు.
Also Read
- Sobhita Dhulipala: ఒక హీరోతో ఇలా పెళ్లి జరుగుతుందని ఎప్పుడూ అనుకోలేదు: శోభితా ధూళిపాళ్ల
- Toxic Advance Booking: ఒక్క గంటలోనే లక్ష టికెట్లు.. యష్ సినిమాకు మామూలు క్రేజ్ కాదు!
- Sandeep Reddy Vanga : ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్!
- Romanchakam Trailer: సందీప్ రెడ్డి వంగా ప్రెజెంట్స్.. ‘రోమాంచకం’ ట్రైలర్లో ఏదో గట్టిగానే ఉంది!


తమన్నా మాట్లాడుతూ, ”తెలుగు సినిమా అంటే నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. నా జర్నీ తెలుగు నుండే సార్ట్ అయ్యింది. రాజమౌళి, సుకుమార్ సార్ అందరూ మన ఇండియన్ రూట్స్ కథలు తీసుకొని చేస్తుంటారు. ఇప్పటికీ మన ఇండియన్ సినిమాను మన ఎమోషన్సే నడిపిస్తాయి. తొలి సారిగా లేడీ బౌన్సర్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ స్క్రిప్ట్ దొరకడం నా అదృష్టం. పలు సార్లు జాతీయ అవార్డ్స్ పొందిన మధుర్ భండార్కర్ సర్ తో చేసే అవకాశం వచ్చిందుకు చాలా గ్రేట్ గా ఫీల్ అవుతున్నాను. ఈ సినిమాలో హర్యానాకు చెందిన యువతిగా నటించాను. తప్పకుండా ఇది నా కెరీర్ లో బెస్ట్ మూవీ అవుతుంది. మధుర్ బండార్కర్ సినిమాలో నటించిన హీరోయిన్స్ కు జాతీయ అవార్డ్స్ వస్తాయి. నాకు కూడా ఈ చిత్రానికి అవార్డ్స్ రావాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను” అని చెప్పింది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ నెల 23 నుండి స్ట్రీమింగ్ అయ్యే ఈ మూవీని కుటుంబ సమేతంగా ఇంట్లో కూర్చొని హ్యాపీగా చూడవచ్చని తమన్నా హామీ ఇచ్చింది.
తాజావార్తలు
-
Sobhita Dhulipala: ఒక హీరోతో ఇలా పెళ్లి జరుగుతుందని ఎప్పుడూ అనుకోలేదు: శోభితా ధూళిపాళ్ల
-
Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి అన్ని శుభాలే, స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు!
-
Boltt Ace 5G, Evo: బోల్ట్ ఏస్ 5G, ఇవో రిలీజ్.. 6000mAh బ్యాటరీ, 64MP AI కెమెరా, 8GB ర్యామ్.. ధర, ఫీచర్లు ఇవే
-
US Iran Sanctions: ఇరాన్‌తో ఆయిల్ డీల్స్.. 4 భారతీయ కంపెనీలపై ట్రంప్ ఆంక్షలు! అసలు కారణం ఇదే
-
Sugar Prices Fall: సామాన్యులకు తీపి కబురు.. భారీగా తగ్గిన చక్కెర ధరలు
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్‌ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!