Ooru Peru Bhairavakona Collected 1.1 Crores Gross from Premiere Shows: హీరో సందీప్ కిషన్ – దర్శకుడు VI ఆనంద్‌ల కాంబోలో వచ్చిన టైగర్ సినిమా గతంలో సూపర్ హిట్ అయింది. ఇక ఇప్పుడు ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌కి చెందిన అనిల్ సుంకర సమర్పణలో హాస్య మూవీస్‌కి చెందిన రాజేష్ దండా ఊరు పేరు భైరవకోన అనే సూపర్‌నేచురల్ ఫాంటసీ అడ్వెంచర్ సినిమాను నిర్మించారు. చాలా కాలం క్రితమే షూట్ పూర్తి చేసుకున్న ఈ సినిమా కొన్ని వాయిదాల అనంతరం ఎట్టకేలకు విడుదలకు సిద్దమయింది. ఇక ఫిబ్రవరి 16న రిలీజ్ అవుతున్న ఈ సినిమాకి ముందుగానే ప్రీమియర్స్ వేశారు మేకర్స్. సినిమాపై నమ్మకం ఉన్న మేకర్స్ ముందుగానే రెండు రోజుల ముందుగానే ప్రీమియర్ షోలు వేయాలని నిర్ణయించుకున్నారు. నిన్న రాత్రి ప్రదర్శించిన ప్రీమియర్ షోల నుండి సినిమాకు యూనానిమస్ పాజిటివ్ టాక్ వచ్చింది. ఇక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ప్రీమియర్ షోల గ్రాస్ 1.1 కోట్లు దాకా వచ్చాయని అంటున్నారు.
Priyamani : ఆయన నా ఫేవరేట్ కోస్టార్.. ఆయనతో ఓ యాక్షన్ సినిమా చేయాలని వుంది..
ఇక ఈ సినిమాలో సందీప్ కిషన్ సరసన వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్ లు హీరోయిన్లుగా నటించారు. VI ఆనంద్ ఒక ఫాంటసీ ప్రపంచాన్ని సృష్టించి ప్రేక్షకులకు ఎడ్జ్ ఆఫ్ ది సీట్ అనుభవాన్ని అందించడానికి సినిమాను గ్రిప్పింగ్‌గా రూపొందించాడని సినిమా చూసిన వారు అంటున్నారు. ఇక ఈ సినిమాలో సందీప్ కిషన్ తన అద్భుతమైన నటనకు ప్రశంసలు అందుకుంటున్నాడు. బ్యూటిఫుల్ లవ్ సాగాగా అనిపిస్తున్న ఈ సినిమా కోసం సందీప్ కొన్ని రిస్కీ స్టంట్స్ చేశాడు. రేపు ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రానికి రాజ్ తోట కెమెరామెన్ గా వ్యవహరించగా శేఖర్ చంద్ర సంగీతం పెద్ద అసెట్స్ అని అంటున్నారు.
