Oori Peru BhairavaKona to Release on Febraury 9th: హీరో సందీప్ కిషన్ డైరెక్టర్ విఐ ఆనంద్ రెండోసారి కలిసి చేస్తున్న ఫాంటసీ అడ్వెంచర్ సినిమా పేరు ‘ఊరు పేరు భైరవకోన’. హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా నిర్మిస్తుండగా, ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర సగర్వంగా సమర్పిస్తున్నారు. బాలాజీ గుత్తా ఈ చిత్రానికి సహ నిర్మాత కాగా ఇప్పటికే షూట్ పూర్తయింది. సినిమాలో వీఎఫ్ఎక్స్ పార్ట్ ఎక్కువగా ఉండడంతో ఈ సినిమా వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ సినిమాను ఫిబ్రవరి 9న రిలీజ్ చేసేందుకు అంతా ప్లాన్ చేశారు. ఈలోపు సంక్రాంతి హడావుడిలో ఈగల్ వాయిదా పడగా దాన్ని సోలో రిలీజ్ చేసుకునేందుకు ఫిబ్రవరి 9 డేట్ నే ఇచ్చారు.
Hanuman Premieres: హను-మాన్ ఆ క్రేజ్ ఏందయ్యా?
అదే రోజు రావాల్సిన టిల్లు స్క్వేర్ వాయిదా పడగా ముందు రోజు యాత్ర 2 రిలీజ్ చేస్తున్నారు. ఇక అదే డేట్ న రజనీకాంత్ లాల్ సలామ్ సినిమా కూడా రిలీజ్ కానుంది. ఇక ఇప్పుడు ‘ఊరు పేరు భైరవకోన’ను కూడా అదే రోజున రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. ఈగల్ సినిమాకి సోలో డేట్ ఇస్తున్నప్పుడు అసలు తమను సంప్రదించలేదని నిర్మాతలు చెబుతున్నారు, సంప్రదించినా తమ ఇబ్బందుల వలన వాయిదా వేసుకునే అవకాశం లేదని కూడా చెబుతున్నారు. శేఖర్ చంద్ర ఈ చిత్రానికి సంగీతం అందించగా కావ్య థాపర్ మరో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రానికి రాజ్ తోట సినిమాటోగ్రఫీ అందించారు. ఛోటా కె ప్రసాద్ ఎడిటర్, ఎ రామాంజనేయులు ఆర్ట్ డైరెక్టర్. భాను భోగవరపు, నందు సవిరిగాన ఈ చిత్రానికి సంభాషణలు అందిస్తున్నారు.