NTV Telugu Site icon

Silk Smitha: సిల్క్ స్మిత శవాన్ని చూడడానికి వచ్చిన ఏకైక హీరో.. అతనే

Silk

Silk

Silk Smitha: అలనాటి అందాల తార సిల్క్ స్మిత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె చేసిన సాంగ్స్ ఇప్పటికీ ఎక్కడో ఒక చోట వినిపిస్తూనే ఉంటాయి. నిజం చెప్పాలంటే.. సిల్క్ జీవితం ఒక పువ్వు లాంటిది. అందు ఆ పువ్వుని చూసారు కానీ, దానికింద ఉన్న ముళ్ళును మాత్రం ఎవరు చూడలేకపోయారు. ఆ ముళ్ళమీద నడుస్తూనే ఆమె చిరునవ్వులు చిందించింది. ఎంతమంది హృదయాల్లో శృంగార తారగా కొలువుండిపోయింది. ఇక ఈ మధ్య వచ్చిన దసరా సినిమా ద్వారా ఆమెను మరోసారి అభిమానులు తలుచుకున్నారు. సిల్క్ జీవితం మొత్తం అందరికి తెల్సిందే. ఎన్నో ఆవమానాలు పడి, స్టార్ డమ్ ను తెచ్చుకుంది. చివరికి ఆ స్టార్ డమ్ వలనే ఆమె చనిపోయింది. ఎందుకంటే .. తెరమీద ఆమె అందాలను ఆస్వాదించినవారే.. బయట ఆమెను చాలా చులకనగా చూసేవారట. ఆమె సినిమాలో ఉందని తెలిస్తేనే వెళ్లే అభిమానులు కానీ, హీరోలు కానీ.. బయట ఆమెను అవమానించేవారట. వాటితో పాటు నమ్మినవాడు ఆస్తికోసం ఆమెను మోసం చేసాడని తెలియడంతో ఆమె ఇంకా కుంగిపోయింది. ఇదేనా బతుకు అనుకోని 1996లో బలవన్మరణానికి పాల్పడింది.

BoyapatiRAPO: ఏం..బోయామామ.. మా రామ్ ను ఆ పనికూడా చేయనివ్వడం లేదా..?

సిల్క్ మరణం ఇండస్ట్రీకి తీరని లోటు.. ఇండస్ట్రీలో ఎంతోమందిని ఆమె మరణం కలిచివేసింది. కానీ, ఇండస్ట్రీలో ఉన్న ఏ ఒక్కరు ఆమె చనిపోయినప్పుడు శవాన్ని చూడడానికి కూడా రాలేదు. వారే కాదు కనీసం కుటుంబ సభ్యులు కూడా రాలేదు. ఒక అనాథ శవంలా ఆమెకు అంత్యక్రియలు జరిపించారు. అయితే సిల్క్ స్మిత శవాన్ని చూడడానికి ఒకే ఒక్క హీరో వచ్చాడట. అతనే.. యాక్షన్ కింగ్ అర్జున్. ఎవరు ఎన్ని అన్నా, ఎలా అయినా వార్తలు రాసుకున్నా తనకు నష్టం లేదని, తెగించి ఆమెను కడచూపు చూడడానికి వచ్చాడట అర్జున్. అందుకు కారణం, సిల్క్, అర్జున్ మంచి స్నేహితులు కావడమే.. అంతేకాకుండా సిల్క్ ఎప్పుడు అర్జున్ తో నేను చనిపోయాక నన్ను చూడడానికి వస్తావా ..? అని అడిగేదట. తప్పకుండ వస్తాను అని అర్జున్ చెప్పేవాడని, ఆ మాట నిలబెట్టుకోవడానికే అర్జున్, సిల్క్ శవాన్ని చూడడానికి వెళ్ళాడట. ఇది కోలీవుడ్ లో ఒక నిర్మాత రివీల్ చేసినట్లు చెప్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది.

Show comments