Site icon NTV Telugu

On The Road: పూర్తిగా లడఖ్ లో షూట్ చేసిన ఫస్ట్ ఇండియన్ మూవీ ‘ఆన్ ది రోడ్’ ట్రైలర్ రిలీజ్

On The Road

On The Road

On The Road Trailer Released By Ram Gopal Varma: పూర్తిగా లడఖ్ ప్రాంతంలో తెరకెక్కించిన మొదటి భారతీయ సినిమా ‘ఆన్ ది రోడ్’ తెలుగు, హిందీ, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో రిలీజ్ అయ్యేందుకు సిద్దమవుతోంది. ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను, ట్రైలర్ ను తాజాగా విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన సినిమాలో విజువల్ మూడ్ ను, స్టైలిష్ లుక్ ను మెచ్చుకోవడం మాత్రమే కాకుండా ఇలాంటి అవుట్ పుట్ తీసుకువచ్చేందుకు కృషి చేసిన ఆన్ ది రోడ్ టీమ్ మెంబర్స్ ను ప్రశంసించారు, సినిమా విజయం సాధించాలని శుభాభినందనలు తెలియజేశారు. ఈ చిత్ర దర్శకుడు సూర్య లక్కోజు గతంలో రామ్ గోపాల్ వర్మతో కలిసి పలు చిత్రాలకు పని చేయడం గమనార్హం. ప్రముఖ చిత్ర నిర్మాత, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్(TFCC) ఉపాధ్యక్షులు ముత్యాల రామ్ దాస్ ఈ సినిమా విడుదలకు సహకారం అందిస్తూ ఈ ప్రాజెక్టు లో ఒక భాగం అయ్యారు. ఆయన ఈ చిత్రం గురించి మాట్లాడుతూ ట్రైలర్ మరియు ఈ సినిమా చాలా ప్రత్యేకంగా ఉన్నాయని తప్పకుండా ప్రేక్షకాదరణ చూరగొంటున్నదనే ఆశాభావం వ్యక్తం చేశారు. ఎస్పీఎల్ పిక్చర్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని సూర్య లక్కోజు నిర్మించగా రాజేష్ శర్మ ఈ సినిమాకు సహ నిర్మాత.

Varun Tej – Lavanya: లావణ్య వరుణ్ పెళ్లి అక్కడే.. రిసార్ట్ లొకేషన్ తెలిసిపోయింది!

వెస్టర్న్ ఫిల్మ్ జానర్ అయిన రోడ్ ట్రిప్ చిత్రాలంటే తనకిష్టమని, అందుకే ఒక సింపుల్ కథను బడ్జెట్ పరిమితులు ఉన్నప్పటికీ లడఖ్ లోని సుందరమైన ప్రదేశాల్లో చిత్రీకరించి ప్రేక్షకులకు అందివ్వాలనే ప్రయత్నం చేశామని అన్నారు. ఇదొక రోడ్ ట్రిప్ థ్రిల్లర్ అయినప్పటికీ, సేఫ్ గా రోడ్ ట్రిప్ ప్లాన్ చేసుకున్న ఒక జంటతో ఒక సాధారణ వ్యక్తి కలవడం, అతడు వారితో ప్రయాణం మొదలు పెట్టిన తర్వాత చోటు చేసుకున్న కల్లోల సంఘటనలే ఈ చిత్ర కథాంశం అని తెలిపారు. ఈ సినిమాలో హీరో పాత్ర పోషించడంలో ఎదుర్కొన్న ఛాలెంజిల గురించి రాఘవ్ మాట్లాడుతూ పాత్రకు జీవం పోసేందుకు చిన్న చిన్న అంశాలను దృష్టిలో పెట్టుకున్నానని చెబుతూ, అవుట్ పుట్ పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. హీరోయిన్ స్వాతి మెహ్రా తన మొదటి సినిమా లడఖ్ లాంటి అందమైన ప్రాంతంలో తెరకెక్కడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ ఆక్సిజన్ సరిగా అందకపోవడం లాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో షూటింగ్ చేయడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నానని అన్నారు. అయితే ఫైనల్ అవుట్ పుట్ చూసిన తర్వాత ప్రేక్షకుల ఆదరణ తప్పకుండా లభిస్తుందనే నమ్మకంతో సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని చెప్పారు.

Exit mobile version