OMG : నవ్విస్తూ భయపెడుతున్న ఓ మంచి దెయ్య్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
OMG (O Manchi Ghost) Official Trailer: వెన్నెల కిషోర్, నందితా శ్వేత ప్రధాన పాత్రల్లో నటించిన హారర్, కామెడీ ఎంటర్‌టైనర్ OMG (ఓ మంచి ఘోస్ట్) రిలీజ్ కి రెడీ అవుతోంది. మార్క్ సెట్ నెట్‌వర్క్స్ బ్యానర్ మీద డా.అబినికా ఇనాబతుని నిర్మించిన ఈ చిత్రానికి శంకర్ మార్తాండ్ దర్శకత్వం వహించారు. ఇక జూన్ 21న రాబోతోన్న ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా థియేట్రికల్ ట్రైలర్‌ను చిత్రయూనిట్ విడుదల చేసింది. ట్రైలర్ చూస్తే ఆసక్తికరంగా మొదలైంది. ‘ఈ బంగ్లాలో ఒక అమ్మాయిని చంపేశారు.. ఆ అమ్మాయే దెయ్యంగా మారి అందరినీ చంపేస్తోందని కథలుకథలుగా చెప్పుకుంటున్నారు’ అనే డైలాగ్‌తో ట్రైలర్ ఆరంభమైంది. ‘అందరి సమస్యలు వేరే అయినా వాటికి పరిష్కారం మాత్రం డబ్బు’.. అని ఓ గ్యాంగ్ పిశాచిపురంలోకి ఎంటర్ అవ్వడంతో ట్రైలర్‌లో ఫన్ ఎలిమెంట్స్ స్టార్ట్ అయ్యాయి.
Highest Grosser: బాహుబలి, ఆర్ఆర్ఆర్ కాదు.. దేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా ఇదే!
Also Read
- Tollywood: సీక్వెల్ కావాలంటున్న స్టార్ హీరో.. ‘నో’ అంటున్న డైరెక్టర్!
- RC17: రామ్ చరణ్ ఊరమాస్ మేకోవర్.. సుకుమార్ పక్కా స్కెచ్!
- Michael Jackson: మైఖేల్ జాక్సన్ స్పైడర్ మ్యాన్ అవ్వాలనుకున్నాడా? మరి ఎందుకు కుదరలేదు?
- Vikram Controversy: అరుదైన కోతితో విక్రమ్ వీడియో వైరల్ .. విచారణ చేపట్టిన అటవీ శాఖ.. అసలు కథేంటి?
‘ఇప్పటి వరకు ఆటాడితే ఎలా ఉంటుందో చూశారు.. ఇప్పుడు వేటాడితే ఎలా ఉంటుందో చూపిద్దాం..’ అంటూ అసలైన హారర్ బొమ్మని చూపించారు. ఈ ట్రైలర్ చూస్తుంటే సినిమాలో ఎంతలా నవ్విస్తారో.. అంతలా భయపెట్టించేలా ఉన్నారు. ఈ సినిమాలో కామెడీ, సూపర్ నేచురల్, హారర్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఇలా అన్నీ ఉన్నాయని ట్రైలర్ చూసిన తరువాత అర్థం అవుతుంది. . నందితా శ్వేత దెయ్యంగా భయపెడుతుంటే.. వెన్నెల కిషోర్, షకలక శంకర్, నవమి గాయక్, నవీన్ నేని, రజత్ రాఘవ్, రఘుబాబు వంటి వారు భయపడుతూనే నవ్వించేశారు. అనూప్ రూబెన్స్ సంగీతం ఈ చిత్రానికి మేజర్ అస్సెట్ అని టీం చెబుతోంది
తాజావార్తలు
-
Tollywood: సీక్వెల్ కావాలంటున్న స్టార్ హీరో.. ‘నో’ అంటున్న డైరెక్టర్!
-
BC Reservations: అసెంబ్లీ ముందుకు బీసీ రిజర్వేషన్ బిల్లు.. స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్స్..
-
RC17: రామ్ చరణ్ ఊరమాస్ మేకోవర్.. సుకుమార్ పక్కా స్కెచ్!
-
Explainer: పాక్ కొత్త పొత్తులు, పాత కక్షలు.. దాయాది దారి ఎటు?
-
Tamil Nadu: “విజయ్ ప్రియమైన త్రిషకు డిప్యూటీ సీఎం పదవి ఎప్పుడు.?” అన్నాడీఎంకే నేత సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..