NTV Telugu Site icon

Om Raut Responds: ఆదిపురుష్ ట్రోలింగ్స్ పై స్పందించిన ఓం రౌత్.. నేను చేసిన తప్పల్లా ఇదే?

Adipurush Trollings

Adipurush Trollings

Om Raut Response on Adipurush Trolling: ఆదిపురుష్ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి ప్రభాస్ ఫాన్స్ మాత్రమే కాదు హిందుత్వ వాదులు అందరూ ఓం రౌత్ మీద ఒక రేంజ్ లో విరుచుకు పడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ట్రోలింగ్స్ మీద ఆది పురుష్ డైరెక్టర్ ఓం రౌత్ క్లారిటీ ఇచ్చినట్టు వెల్లడించారు తెలుగులో స్పెషల్ అనే సినిమా డైరెక్ట్ చేసిన వాస్తవ్. ఈ మేరకు ఆయన తన సోషల్ మీడియాలో ఒక సుదీర్ఘ పోస్ట్ షేర్ చేశారు. ఆయన పోస్ట్ యధాతధంగా ‘’ఆది పురుష్ మూవీ సెట్ కి క్యాస్టింగ్ డైరెక్టర్ విక్కీ సిదానాతో కలిసి వెళ్ళినప్పుడు డైరెక్టర్ ఓం రౌత్ తో కొంతసేపు మాట్లాడాను. నా మూవీ “స్పెషల్ ” హిందీ రీమేక్ కోసం అభిషేక్ బచ్చన్ ని కలవడానికి వెళ్ళినప్పుడు నా మూవీ కి కూడా విక్కీ నే కాస్టింగ్ డైరెక్టర్ అవ్వడం వల్ల, అతనికి ఓం రౌత్ ఫ్రెండ్ అవ్వడం వల్ల అనుకోకుండా వెళ్లి కలిశాను. అతనికి ఉన్న టెక్నికల్ నాలెడ్జ్ చూసి ఆశ్చర్యం అనిపించింది. ఆ గ్రీన్ మాట్ సెట్ బహుశా 1000 స్క్వేర్ యార్డ్స్ సైజులో ఒక రెసిడెన్షియల్ కాలనీలో ఉంది. ఈ సెట్ లోనే మొత్తం సినిమా తీయబోతున్నామని అతను చెప్పినప్పుడు మైండ్ బ్లాక్ అయ్యింది, కానీ ఇప్పుడు సినిమా చూస్తే అంత భారీ సినిమా మొత్తం ఆ చిన్న సెట్ లోనే చేశాడంటే నమ్మ బుద్ధి కావట్లేదు (ఆశ్చర్యం తో )పైగా ఇంత త్వరగా అతను ఇంత పెద్ద బడ్జెట్ సంపాదించగల్గినందుకు కొంచెం జలసీ వేసింది. ఇంతకుముందు అతను తీసిన తానాజీ, లోకమాన్య సినిమాల కంటే ఆదిపురుష్ 10-15 రెట్లు కష్టమైనది. అతనికున్న ఆర్ఎస్ఎస్ భావజాలం తోనే అతని సినిమా సెలక్షన్ లన్ని ఉన్నాయని నాకర్థం అయింది అతనితో మాట్లాడినప్పుడు.

The Night Manager 2 Review: ది నైట్ మేనేజర్ పార్ట్ 2 రివ్యూ

అక్కడ ఆదిపురుష్ పోస్టర్ చూసి నాకు ఫస్టు వచ్చిన డౌటు ప్రభాస్ క్యారెక్టర్ రాముడేనా లేక హనుమంతుడా అని, ఎందుకంటే ఫస్టు పోస్టర్ హనుమాన్ దే. అతను నవ్వుతూ రాముడే అన్నాడు. విక్కీ మాత్రం ప్రభాస్ తో హనుమాన్ చేయిస్తే క్యాస్టింగ్ డైరెక్టర్ అయిన నన్ను కొడతారు దేశం మొత్తం అన్నాడు నవ్వుతూ. నవ్వుతూ బాయ్ చెప్పి వచ్చేసాం అక్కడ నుంచి. కొన్ని రోజులకే సెట్ షార్ట్ సర్క్యూట్ అయ్యి కాలిపోయింది. మళ్ళీ షూట్ స్టార్ట్ చేయడానికి 6 నెలలు పైగా పట్టింది. తర్వాత కలిసినప్పుడు ఓం రౌత్ రాముడి మీద నా భక్తే నా సినిమాని ముందుకు తీసుకెళ్తుంది అన్నాడు. తర్వాత నాకు అతన్ని కలవడం, మాట్లాడటం కుదరలేదు. మూవీ రిలీజ్ తర్వాత ప్రతి వాళ్ళు విపరీతంగా ట్రోల్ చేస్తూ అసలిది రామాయణమే కాదు. హిందూత్వాన్ని అవమానించాడు అని రకరకాలుగా కామెంట్స్ చేస్తుంటే నేనతన్ని అడిగాను? ఎక్కడ దెబ్బ కొట్టిందో అర్థమైందా అని? అతను చెప్పింది “నేను కధ మార్చలేదు, స్క్రీన్ మార్చాను అంతే. క్యారెక్టర్స్ మార్చలేదు, కొన్ని గెటప్స్ మార్చాను అంతే. లొకేషన్స్ మార్చలేదు కొత్తగా, ఇంకొంచెం భారీగా చూపించాలనుకున్నాను అంతే. మన కధ మనమే కాదు ప్రపంచం మొత్తం చూడాలనుకున్నాను అంతే. వేరే వాళ్ళు తీసినట్లుగానో రాసినట్టుగానో కాదు, మా అమ్మ నాకు చెప్పినప్పుడు నా మనసులో ఏం చూసానో ఆది తీయాలనుకున్నాను.

కాకపోతే నా వల్ల అయిన తప్పల్లా మోడరన్ జనరేషన్ కి మోడరన్ గా చూపిస్తేనే ఎక్కుతుంది అని అనుకోవడమే., ఇంకో తప్పు రామాయణం మొత్తాన్ని 3 గంటల్లో చూపించాలని ట్రై చెయ్యడం కూడా ” అన్నాడు. ఆఫ్ కోర్స్ నేనన్నాను,సినిమా బానే ఉందన్నారనే వాళ్ళు కూడా కొంచెం ఎక్కువ గానే ఉన్నారు, అందుకే ఇంత కలెక్షన్లు వస్తున్నాయని. కానీ కలెక్షన్లు కంటే ఈ సినిమాకి ఆడియన్స్ ఫీడ్ బ్యాక్ ఎక్కువ ఇంపార్టెంట్ అని అతని ఫీలింగ్. నా ఇంకో క్వశ్చన్ అందరు అనుకుంటుంది… అసలు రాముడు చూస్తుండగా సీతని ఎత్తుకెళ్లడం ఏంటి. రాముడు ఆపేయ్యలేడా. అలా వదిలేస్తాడా అని ? ఇది నా క్వశ్చన్ కాదు. అందరు అడుగుతున్నదే. నాకైతే అదేం తప్పనిపించలేదు. అని అడిగితే అతను చెప్పిన ఆన్సర్ కి నేను టోటల్లీ కన్విన్స్డ్ . అతనన్నాడు… అసలు రాముడు పుట్టిందెందుకు? రావణుడిని చంపడానికే. రావణుడు సీతని ఎత్తికెళ్తేనే అది సాధ్యం. రాముడికి ముందే తెలియదంటావా రావణుడు సీతని ఎత్తికెళ్తాడని? ఆ తర్వాతే అతన్ని చంపుతానని. రామావతారం ఎత్తినోడికి, ఎప్పుడేం జరుగుతుందో ముందే అన్నీ తెలిసినోడికి,ఆయన ముందు ఎత్తికెళ్తే ఎంత వెనకాల ఎత్తి కెళ్తే ఎంత? అర్ధమైనోడికి అర్ధమైనంత. ఇక తిట్లంటారా రాముడి మీద భక్తితో తీశా. ఆయన తిట్టిస్తే తింటా… అన్నాడు. అంతే.’’

Show comments