Olivia Morris:ఆర్ఆర్ఆర్ .. ఆర్ఆర్ఆర్ .. ఆర్ఆర్ఆర్ .. ప్రస్తుతం ఈ పేరు ఇంటర్నేషనల్ మారుమ్రోగిపోతుంది. అవార్డులు.. రివార్డులు.. ఎక్కడ చూసినా అభిమానుల గెంతులు.. ఒకటి అని చెప్పడానికి లేదు. ఒక తెలుగు సినిమా ప్రపంచాన్ని షేక్.. షేక్ ఆడిస్తోంది. ఇక అవార్డుల విషయానికొస్తే లెక్కే లేదు. తాజాగా ఎన్టీఆర్ కు, అలియా భట్ కు కూడా HCA అవార్డ్స్ ను అందిస్తున్నట్లు తెలిపారు. మొన్నటివరకు చరణ్ కు మాత్రమే అవార్డులు వస్తున్నాయి అని ఎన్టీఆర్ అభిమానులు రచ్చ చేయడంతో HCA.. కంగారు పడకండి.. ఎన్టీఆర్ కు కూడా అవార్డ్స్ ఉన్నాయని చెప్పి అభిమానులను ఆనందంలో ముంచెత్తింది. ఇక ఎన్టీఆర్ తో పాటు సీతగా నటించిన అలియా భట్ కూడా అవార్డు సొంతం చేసుకుంది. అందరికి అవార్డులు రావడం సంతోషంగానే ఉంది కానీ.. మా జెన్నీ పాపను వదిలేయడం కొంచెం అసంతృప్తికి గురిచేస్తోందని ఒలీవియా ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు.
Manchu Lakshmi: ఈ ఒక్క విషయంలో మాత్రం నువ్వు దేవతవక్కా..
ఆర్ఆర్ఆర్ సినిమాలో చరణ్ కు జోడిగా అలియా కనిపించగా.. ఎన్టీఆర్ కు జోడిగా ఒలీవియా మోరిస్ కనిపించింది. జెన్నీ పాత్రలో ఆమె చేసిన నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ముఖ్యంగా ఎన్టీఆర్- ఒలీవియా మధ్య వచ్చిన సన్నివేశాలు అయితే అద్భుతమని చెప్పుకొస్తున్నారు. అలాంటి నటనను కనబరిచిన ఆమెకు ఒక్క అవార్డు కూడా రాకపోవడమేంటీ.. ఆమెకు కూడా ఒక అవార్డు ఇస్తే.. మేము కూడా సంతోషిస్తాం అని నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు. ఇక ఒలీవియా తాజాగా ఆర్ఆర్ఆర్ టీమ్ కు కంగ్రాట్స్ చెప్పుకొచ్చింది. HCA అవార్డ్స్ అందుకున్న చిత్రం బృందం ఫోటోను షేర్ చేస్తూ ప్రైసింగ్ హ్యాండ్స్ ఎమోజీని షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.
https://twitter.com/OliviaMorris891/status/1631644562950070273?s=20
