OTT Updates: టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ నటించిన లేటెస్ట్ మూవీ ఒకే ఒక జీవితం. సెప్టెంబర్ 9న విడుదలైన ఈ మూవీ తొలిరోజే మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. టైం ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా అందరినీ ఆకట్టుకుంది. ఈ సినిమాలో అక్కినేని అమల శర్వానంద్ తల్లి పాత్రలో నటించారు. మదర్ సెంటిమెంటుతో సాగే ఈ సినిమా ప్రతి ఒక్కరినీ కదిలించింది. ఈ మూవీలో శర్వాకు జోడీగా రీతూవర్మ హీరోయిన్‌గా నటించింది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్.ఆర్ ప్రకాష్‌బాబు, ఎస్.ఆర్ ప్రభు ఈ చిత్రాన్ని నిర్మించారు. నూతన దర్శకుడు శ్రీ కార్తీక్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.
బాక్సాఫీస్ దగ్గర హిట్ సినిమాగా నిలిచిన ఒకే ఒక జీవితం ఇప్పుడు ఓటీటీలో రిలీజ్‌కు సిద్ధమైంది. ఈ సినిమా డిజిటల్ రిలీజ్ కోసం ప్రేక్షకులు కూడా ఎంతో ఎదురుచూస్తున్నారు. అక్టోబర్ 20 నుంచి ఈ మూవీని స్ట్రీమింగ్ చేయనున్నట్లు సోనీ లివ్ ప్రకటించింది. ‘జీవితం రెండో అవకాశం ఇస్తే విధిరాతను మార్చుకోగలమా? శర్వానంద్, రీతూవర్మ, అమల కలయికలో వచ్చిన ఒకే ఒక జీవితం మూవీ ఈ నెల 20 నుంచి మీ సోనీలివ్ ఇంటర్నేషనల్‌లో’ అంటూ రిలీజ్ డేట్‌ను వెల్లడించింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను సుమారు రూ.15 కోట్లకు సోనీ లీవ్ కైవసం చేసుకున్నట్లు సమాచారం. కాగా ఒకే ఒక జీవితం మూవీ శర్వానంద్ కెరీర్‌లో 30వ సినిమా కావడం విశేషం.
జీవితం రెండో అవకాశం ఇస్తే విధి రాతను మార్చుకోగలమా?
శర్వానంద్, రీతు వర్మ, అమల కలయికలో వచ్చిన “ఒకే ఒక జీవితం” ఈ నెల 20 నుండి మీ సోనీ LIV International లో#OkeOkaJeevithamOnSonyLIV #SonyLIVInternational #OkeOkaJeevitham pic.twitter.com/QMQPpxiCJq— Sony LIV International (@SonyLIVIntl) October 10, 2022
