Site icon NTV Telugu

The Kashmir Files : దర్శకుడికి అరుదైన గౌరవం… పీఎంకు స్పెషల్ థ్యాంక్స్

Vivek Agnihotri

Vivek Agnihotri

సైలెంట్ గా వచ్చి కోట్లు కొల్లగొట్టిన చిత్రం “ది కాశ్మీర్ ఫైల్స్‌”. అదే లెవెల్లో విమర్శలూ ఎదుర్కొంది ఈ మూవీ. అంతేనా సినిమా గురించి ఢిల్లీ రాజకీయాల్లోనూ గట్టి చర్చే జరిగింది. ఏకంగా ప్రధాన మంత్రి సినిమాను ప్రమోట్ చేస్తూ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారు అనే విమర్శలూ తప్పలేదు. ఏదైతేనేం సినిమా ప్రేక్షకులకు నచ్చింది. కలెక్షన్లూ భారీగానే రాబట్టింది. అటు దర్శకుడికి మంచి పేరు, ఇటు నిర్మాతలకు అద్భుతమైన లాభాలూ వచ్చాయి. తాజాగా “ది కాశ్మీర్ ఫైల్స్‌” డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రికి అరుదైన గౌరవం దక్కింది. ఓహియో స్టేట్ వివేక్ అగ్నిహోత్రిని గౌరవించింది.

Read Also : Akhanda : టెలివిజన్ రికార్డులను బ్రేక్ చేయడానికి రెడీ

దానికి సంబంధించిన పిక్ ను దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ “మొత్తం The Kashmir Files బృందం తరపున, మా ప్రేక్షకుల తరపున నేను ఈ గౌరవాన్ని అందించినందుకు స్టేట్ ఆఫ్ ఒహియో సెనేట్‌కి ధన్యవాదాలు తెలుపుతున్నాను. కాశ్మీరీ హిందువుల మారణహోమాన్ని, భారతదేశం గొప్ప మానవత్వ విలువను ప్రపంచం గుర్తిస్తోంది. ఆర్టికల్ 370ని రద్దు చేసినందుకు పీఎం నరేంద్ర మోదీకి ధన్యవాదాలు” అంటూ కృతజ్ఞతలు తెలిపారు. “ది కాశ్మీర్ ఫైల్స్”తో అద్భుతమైన ప్రయత్నం చేసినందుకు దర్శకుడిపై ఒహియో సెనేటర్ మాట్ హఫ్ఫ్‌మన్, ప్రెసిడెంట్ అండ్ స్టేట్ సెనేటర్ నీరజ్ అటానీ ప్రశంసలు కురిపించారు. కాగా మార్చి 11న విడుదలైన “ది కాశ్మీర్ ఫైల్స్‌” చిత్రం 1990లో కాశ్మీర్ తిరుగుబాటు సమయంలో కాశ్మీరీ హిందువుల వలసల ఆధారంగా రూపొందింది. ఇందులో అనుపమ్ ఖేర్, దర్శన్ కుమార్, మిథున్ చక్రవర్తి, పల్లవి జోషి నటించారు.

Exit mobile version