Site icon NTV Telugu

Parada : అయ్యో అనుపమ.. కనీసం అప్డేట్ లేకుండా ఓటీటీలో వదిలేసారు

Paradha

Paradha

కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్‌, దర్శన ప్రధాన పాత్రలో రీసెంట్ గా వచ్చిన చిత్రం పరదా. శుభం ఫేమ్ ప్రవీణ్‌ కండ్రేగుల దర్శకత్వం వహించాడు. డిఫ్రెంట్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా అనేక సార్లు వాయిదా అనంతరం ఆగస్టు 22న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకుంది అనుపమ. బ్యాక్ టు బ్యాక్ ప్లాపుల నుండి పరదా గట్టెక్కిస్తుందని భావించింది. కానీ ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన రాబట్టింది పరదా. కథ బాగున్నప్పటికి కథనం ఆసక్తికరంగా లేదు. దాంతో ప్రేక్షకునుండి పరదా తిరస్కరణకు గురైంది. కాగా ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ కొనుగోలు చేసింది. అయితే ఉన్నట్టుండి పరదా ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. కనీసం ముందస్తు అప్డేట్, ప్రమోషన్స్ లేకుండా సైలెంట్ గా ఓటీటీలోకి తీసుకువచ్చింది. థియేటర్ లో రిలీజ్ అయినా ఇరవై రోజులకు ఓటీటీ స్టీమింగ్ చేసేసింది అమెజాన్. మరి థియేటర్ లో ప్లాప్ అయిన పరదా ఓటీటీ ఆడియెన్స్ ను మెప్పిస్తుందేమో చూడాలి. అయితే తెలుగు, మలయాళం బాషలలో మాత్రమే స్ట్రీమింగ్ చేస్తోంది అమెజాన్ ప్రైమ్ వీడియో.

Exit mobile version