Site icon NTV Telugu

OG : ఓజీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఫ్యాన్స్‌కి డబుల్ ట్రీట్..!

Og

Og

పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న చిత్రం ‘ఓజీ’. ‘రన్ రాజా రన్’, ‘సాహో’ సినిమాలతో ప్రత్యేకమై‌న స్టైల్ చూపించిన దర్శకుడు సుజీత్ ఈ సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నాడు. పవన్‌ ఇందులో ఓజాస్ అనే పవర్‌ఫుల్ రోల్‌లో అలరించనుండటంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. నిర్మాత డీవీవీ దానయ్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

Also Read : Urmila : 30 ఏళ్లు పూర్తి చేసుకున్న ‘రంగీలా’.. ఊర్మిళ ఎమోషనల్ పోస్ట్

ఇటీవల పవన్‌ బర్త్‌డే సందర్భంగా విడుదలైన ఓజీ గ్లింప్స్ సోషల్ మీడియాలో సునామీ సృష్టించింది. చిన్న సినిమాలు సంచలనాలు క్రియేట్ చేస్తుంటే, పెద్ద సినిమాలు బాక్సాఫీస్ వద్ద కష్టాల్లో ఉన్న ఈ సమయంలో, ఓజీ మాత్రం ఆ ధోరణిని బ్రేక్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు నమ్ముతున్నారు. ఇప్పటికే నార్త్ అమెరికాలో ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. రిలీజ్‌కు 18 రోజుల ముందే 50 వేలకు పైగా టికెట్లు సేల్ అవ్వడం, కేవలం నార్త్ అమెరికా నుంచే 12 లక్షల డాలర్ల గ్రాస్ రావడం ఈ క్రేజ్‌కు నిదర్శనం.

ఇకపోతే, ప్రీ రిలీజ్ ఈవెంట్ విషయంలో ఓ భారీ ప్లాన్‌తో ముందుకు వెళ్తున్నారు మేకర్స్. ఈ నెల 19న విజయవాడలో, 21న హైదరాబాద్‌లో ఈవెంట్స్ నిర్వహించనున్నట్లు సమాచారం. అయితే హైదరాబాద్ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరవుతారని టాక్ గట్టిగా వినిపిస్తోంది. ఇది నిజమైతే మెగా ఫ్యాన్స్‌కి పండగే కాకుండా, పవన్-చిరంజీవి ఒకే వేదికపై కనిపించడం అభిమానులకు లైఫ్ టైమ్ సెలబ్రేషన్ అవుతుంది. మొత్తానికి ఓజీ సినిమాపై అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొత్త రికార్డులు సృష్టిస్తుందా? అనే ప్రశ్నకు జవాబు సెప్టెంబర్ 25న రానుంది.

Exit mobile version