Site icon NTV Telugu

Danayya : ఓజీ టైటిల్ నాగవంశీదే.. ఇచ్చినందుకు థాంక్స్!

Danaiah

Danaiah

Danayya : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజాస్ గంభీరగా గర్జించిన చిత్రం ఓజీ. సుజీత్ దర్శకత్వంలో డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమాపై మొదటి నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. సెప్టెంబర్ 24 రాత్రి నుంచి ప్రత్యేక షోలతో ఓజీ చిత్రం థియేటర్లలో అడుగుపెట్టింది. మొదటి షో నుంచే ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించిన చిత్ర బృందం, తమ సంతోషాన్ని పంచుకుంది. ఈ క్రమంలో నిర్మాత డీవీవీ దానయ్య మాట్లాడుతూ.. “ఆనందంలో మాటలు కూడా రావడంలేదు. నేను మొట్ట మొదటిగా థాంక్స్ చెప్పాల్సింది త్రివిక్రమ్ శ్రీనివాస్ కి. ఆయన లేకపోతే ఈ ప్రాజెక్ట్ లేదు. పవన్ కళ్యాణ్ తో సినిమా చేద్దాం అనుకున్నప్పుడు.. దర్శకుడు సుజీత్ పేరు త్రివిక్రమ్ సూచించారు. పవన్ కళ్యాణ్ అభిమానులకు నచ్చే సినిమా అందించాలనే ఉద్దేశంతో ఎంతో శ్రద్ధతో ఈ సినిమా చేశాం. సుజీత్ తో రెండున్నరేళ్ళకు పైగా ప్రయాణం చేశాను.

ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు. ఎన్నో రోజులు నిద్ర కూడా మానుకొని ఈ చిత్రం కోసం పనిచేశాడు. సుజీత్ చెప్పినట్టు.. తమన్, నవీన్ నూలి, రవి చంద్రన్ గారు ముగ్గురూ ఈ సినిమాకి మూడు పిల్లర్లు. వీళ్ళు కూడా పగలు రాత్రి అనే తేడా లేకుండా సినిమా కోసం కష్టపడ్డారు. ఓజీ బ్లాక్ బస్టర్ అవుతుందని తమన్ నమ్మకంగా చెప్పేవాడు. ఇప్పుడు అభిమానుల స్పందన చూస్తుంటే సంతోషంగా ఉంది. సినిమాలో పవన్ కళ్యాణ్ గారి లుక్, యాక్షన్ చూసి నేనే ఆశ్చర్యపోయాను. తమన్ అద్భుతమైన నేపథ్య సంగీతం అందించాడు. నటీనటులందరూ అద్భుతంగా నటించారు. ఏఎస్ ప్రకాష్ గారి ఆర్ట్ వర్క్ బాగుంది. డైరెక్షన్ డిపార్ట్ మెంట్, మా మేనేజర్స్ చేసిన కృషిని మరిచిపోలేను. అలాగే నాగవంశీ కి ప్రత్యేక కృతఙ్ఞతలు. నిజానికి ఓజీ అనే టైటిల్ ను ఆయన రిజిస్టర్ చేసుకున్నారు. కానీ, మా కోసం ఆ టైటిల్ ఇచ్చేశారు. ఓజీ టైటిల్ సినిమాకి ఎంతో హెల్ప్ అయింది. విడుదలకు ముందు అభిమానులు ‘ఓజీ ఓజీ’ అంటూ ఎంతో ఉత్సాహంగా ఎదురుచూశారు. ఇప్పుడు సినిమా విడుదలై, వారి ఉత్సాహాన్ని రెట్టింపు చేయడం సంతోషంగా ఉంది.” అన్నారు.

Exit mobile version