పవర్ స్టార్‌ను ఒక అభిమాని ఎలా అయితే చూడాలని అనుకుంటున్నాడో.. అంతకుమించి అనేలా చూపించడానికి రెడీ అవుతున్నాడు దర్శకుడు ‘సుజీత్’. ‘పవన్ కళ్యాణ్’ ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్‌గా నటిస్తున్న ‘ఓజీ’ సినిమా పై అనౌన్స్మెంట్ నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ పవన్ పాలిటిక్స్ కారణంగా ఈ సినిమా లేట్ అయింది. రీసెంట్‌గానే పవన్ ఈ సినిమా షూటింగ్ రీస్టార్ట్ చేశారు. ముంబైతో పాటు విజయవాడలో షూటింగ్ చేశారు. ఇక్కడితో ప్యాచ్ వర్క్ మినహా షూటింగ్ మొత్తం ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్టే. దీంతో.. ‘ఓజీ’ ప్రమోషన్స్ స్టార్ట్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. ఎందుకంటే.. సెప్టెంబర్ 25న ఈ సినిమా రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. కానీ ‘ఓజీ’కి అడ్డుగా వీరమల్లు ఉంది. ‘హరిహర వీరమల్లు’ రిలీజ్ అయితే గానీ ఓజీ అప్డేట్స్ వచ్చేలా లేవు.
గత ఐదేళ్లుగా ఆగుతూ వస్తున్న వీరమల్లు సినిమా పై మంచి అంచనాలు ఉన్నప్పటికీ.. ఓజీ అంత హైప్ అయితే లేదనే చెప్పాలి. ఈ సమయంలో ‘ఓజీ’ అప్డేట్స్ ఇస్తే.. వీరమల్లుకి నష్టమే. అందుకే.. ఈ సినిమా రిలీజ్ అయితేనే, ‘ఓజీ’ వేట మొదలు కానుంది. ఫైనల్‌గా ‘హరిహర వీరమల్లు’ సినిమా జులై 18న రిలీజ్ కానున్నట్టుగా తెలుస్తోంది. దీంతో.. ‘ఓజీ’ ఫస్ట్ సింగిల్ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నట్టుగా సమాచారం. వాస్తవానికైతే.. ఎప్పుడో ఫస్ట్ సింగిల్ విడుదలకు సిద్ధమయ్యాడు సంగీత దర్శకుడు ‘తమన్’. ‘శింబు’ చేత హై ఓల్టేజ్ సాంగ్ పాడించాడు. కానీ రిలీజ్‌కు టైం కలిసి రావడం లేదు. ఫైనల్‌గా ఇప్పుడు వీరమల్లు రిలీజ్ అయిపోతే.. ఆగస్ట్ ఫస్ట్ వీక్‌లో ‘ఓజీ’ ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నట్టుగా సమాచారం. కానీ.. ఇంకా వీరమల్లు కొత్త రిలీజ్ డేడే ప్రకటించలేదు. కాబట్టి.. ప్రస్తుతానికి ఓజికి వీరమల్లు అడ్డుగా ఉందనే చెప్పాలి. లేదంటే.. ఈపాటికే ఓజీ ఊచకోత మామూలుగా ఉండేది కాదు.
