Site icon NTV Telugu

OG: చేతులు మారిన OG.. ఇచ్చిపడేసిన మేకర్స్

Og

Og

OG: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఏపీ ఎలక్షన్స్ దగ్గరపడుతుండటంతో పవన్ సినిమాలకు బ్రేక్ ఇచ్చి పూర్తి ఫోకస్ రాజకీయాలమీదనే పెట్టాడు. దీంతో పవన్ నటిస్తున్న సినిమాలకు బ్రేక్ పడింది. ప్రస్తుతం పవన్ నటిస్తున్న చిత్రాల్లో హైప్ క్రియేట్ చేసిన సినిమా OG.
సాహో ఫేమ్ సుజీత్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఆర్ఆర్ఆర్ తో మంచి విజయాన్ని అందుకున్న డీవీవీ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో పవన్ సరసన ప్రియాంక మోహన్ నటిస్తుండగా.. బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఏదో ఒక రూమర్ నిత్యం సోషల్ మీడియాను షేక్ చేస్తూ ఉంటుంది.

గత రెండు రోజుల నుంచి OG.. డీవీవీ చేతులు మారిందని వార్తలు పుట్టుకొస్తున్నాయి. పవన్ కు ఇంకా షూటింగ్ లేట్ అవుతుందని, ఇంకొన్ని కారణాల వలన డీవీవీ నుంచి ఈ సినిమా పీపుల్స్ మీడియాకు మారిందని పుకార్లు పుట్టుకొచ్చాయి. అయితే తాజాగా ఈ పుకార్లపై డీవీవీ ఎంటర్ టైన్మెంట్స్ స్పందించింది. పుకార్లలో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది. OG మనది.. OG ఎప్పటికీ మనదే..పవన్ కళ్యాణ్ గారి సినిమా ఎలా ఉండబోతుందో మాకు పూర్తి క్లారిటీ ఉంది. మేము దాని దిశగా ముందుకు సాగుతున్నాము. అతనికి ఎల్లప్పుడూ కృతజ్ఞతలు. ఆకలి ఎక్కువ కాలం ఉంటుంది, కానీ చిరుత వేట ఎప్పటికీ వదిలిపెట్టదు” అని చెప్పుకొచ్చారు. దీంతో ఈ వార్తలకు ఫుల్ స్టాప్ పడింది. మరి ఈ సినిమా ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.

Exit mobile version