పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన యాక్షన్ స్టైలిష్ చిత్రం OG. సాహో ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను DVV బ్యానర్ పై దానయ్య నిర్మించారు. ఈ సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అనకాపల్లి నుండి అమెరికా వరకు ఎక్కడ చూసిన OG హైప్ నడుస్తోంది. ఈ రోజు రాత్రి 10 గంటలకు ప్రీమియర్స్ తో రిలీజ్ కాబోతుంది OG.
Also Read : TheyCallHimOG : తీవ్ర జ్వరంతో భాదపడుతున్న పవన్ కళ్యాణ్.. ప్రార్థనలు చేస్తున్న ఫ్యాన్స్
ఈ నేపథ్యంలో ప్రీమియర్ షోస్ కు సంభందించి అడ్వాన్క్ బుకింగ్స్ ఓపెన్ చేయగా హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి OG టికెట్స్. అయితే సినిమాలకు కీలకమైన విజయవాడలో పవర్ స్టార్ OG కేవలం ప్రీమియర్స్ తోనే ఆల్ టైమ్ రికార్డ్ సాధించింది. విజయవాడలోని మొత్తం 8 సింగిల్ స్క్రీన్ థియేటర్స్ లో OG రిలీజ్ కానుంది. అన్నిథియేటర్స్ లో ఓజి ప్రీమియర్స్ వేయబోతున్నారు. మొత్తం ఎనిమిది థియేటర్స్ కు గాను 4286 టికెట్స్ బుక్ అవగా రూ. 42,64,570/- కలెక్ట్ చేసింది. ఈ రేంజ్ వసూళ్లు విజయవాడ హిస్టరీలోనే ఆల్ టైమ్ రికార్డ్ వసూళ్లు అని చెప్పాలి. ఇదిలా ఉండగా విజయవాడ చుట్టుపక్కల కలిపి మొత్తం 64 ప్రీమియర్స్ ప్రదర్శించనున్నారు. కేవలం ప్రీమియర్స్ తో రూ. 1.60 కోట్ల గ్రాస్ రాబట్టే ఛాన్స్ ఉందని ట్రేడ్ అంచనా వేస్తుంది. ప్రీమియర్స్ కే ఈ స్థాయి వసూళ్లు రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది OG. ఈ లెక్కన మొదటి రోజు కూడా భారీ స్థాయి వసూళ్లు రాబడుతుందని గత చిత్రాల తాలూకు రికార్డ్స్ బ్రేక్ చేస్తుందని ట్రేడ్ టాక్.
