పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎదురుచూస్తున్న “ఓజి” సినిమా ఎట్టకేలకు థియేటర్స్‌లో విడుదలైంది. నిన్న రాత్రి ప్రీమియర్‌లలోనే బ్లాస్టింగ్ ఓపెనింగ్ ఇచ్చిన ఈ చిత్రం, క్రేజీ యాక్షన్, ఎంటర్టైనింగ్ మోమెంట్స్‌తో ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ ఇచ్చింది. ప్రేమికుల తో పాటు సినీ ప్రముఖులను కూడా ఊపేసింది. మెగా హీరోలు వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ కూడా తమ మామయ్య సినిమా చూడటానికి థియేటర్‌కి వెళ్లారు. థియేటర్‌లో వారు చేసిన హంగామా అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రముఖ దర్శకుడు హరీశ్ శంకర్ కూడా ఈ షోకి హాజరవడం విశేషం. కాగా ఈ మెగా హీరోలు థీయేటన్ లో చేసిన మాస్ మూమెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Also Read : OG Review : ఓజీ ఓవర్సీస్ రివ్యూ.. ఏంటి గురూ ఇలా ఉంది
ఇక పోతే ఇప్పటి వరకు ఓజి సీక్వెల్ పై చాలా వార్తలు వినిపిస్తునే ఉన్నాయి. కానీ స్పష్టత లేకపోవడంతో ఫ్యాన్స్ ఈ విషయంపై చాలా అత్రుతగా ఉన్నారు. కానీ ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం అధికారికంగా “ఓజి 2” అఫీషియల్‌గా ప్రకటించబడింది. ఈ క్రేజీ సీక్వెల్‌లో థమన్ సంగీతం అందిస్తుండగా, డీవీవి దానయ్య నిర్మాణ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఇప్పటికే #OG2, #PawanKalyan హ్యాష్‌ట్యాగ్‌లతో ఉత్సాహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి OG 2 ఫ్యాన్స్ కోసం నిజమైన క్రేజీ ట్రీట్‌గా మారబోతుంది.
