NTV Telugu Site icon

NC22 : నెక్స్ట్ నాగ చైతన్యతో… తమిళ స్టార్ డైరెక్టర్ అనౌన్స్మెంట్

Nc22

Nc22

వరుస హిట్లతో దూసుకుపోతున్న హీరో నాగ చైతన్య తన గత చిత్రం “బంగార్రాజు”తో సంక్రాంతి కానుకగా బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నారు. చై తాజా చిత్రం “థ్యాంక్యూ” షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ అయ్యింది. మరోవైపు “థ్యాంక్యూ” డైరెక్టర్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలోనే తన ఓటిటి ఎంట్రీకి సిద్ధం అయ్యాడు. “దూత” పేరుతో ఓటిటి సిరీస్ ను ఇప్పటికే స్టార్ట్ చేశారు. ఈ నేపథ్యంలో చైతన్య తన తమిళ ఎంట్రీపై ఆసక్తిని కనబరుస్తున్నారు. ఈ మేరకు ఓ తమిళ స్టార్ డైరెక్టర్ తో తన తదుపరి ప్రాజెక్ట్‌ను ప్రారంభించే యోచనలో ఉన్నాడు.

Read Also : Shah Rukh Khan : “బీస్ట్”కు పెద్ద ఫ్యాన్ అట !!

గత కొన్నాళ్లుగా నాగ చైతన్య ఓ ద్విభాషా చిత్రం చేయబోతున్నాడని, దానికి ట్యాలెంటెడ్ తమిళ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తారనే వార్తలు వస్తున్నాయి. ఈ విషయాన్ని వెంకట్ ప్రభు ఓ ఇంటర్వ్యూలో స్వయంగా వెల్లడించారు కూడా. అయితే అధికారిక ప్రకటన ఒక్కటే మిగిలి ఉండగా, తాజాగా ఆ పని కూడా అయ్యింది. దర్శకుడు వెంకట్ ప్రభు సోషల్ మీడియా వేదికగా అక్కినేని నాగ చైతన్యతో తన నెక్స్ట్ మూవీని అధికారికంగా ప్రకటించారు. తాను దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం తెలుగు, తమిళం ద్విభాషా చిత్రంగా ఉంటుందని వెల్లడించారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు తర్వాత వెల్లడికానున్నాయి. కాగా కమర్షియల్ హంగులతో కూడిన ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్‌ని దర్శకుడు చైతన్య కోసం రెడీ చేశాడని అంటున్నారు. ఈ సినిమాలో నాగ చైతన్య మునుపెన్నడూ చూడని పాత్రలో కనిపించనున్నాడు.