NTV Telugu Site icon

Vishwak Sen: ధమ్కీ డోస్ పెంచుతున్న ‘మాస్ కా దాస్’

Vishwak Sen

Vishwak Sen

యంగ్ స్టార్ హీరో విశ్వక్ సేన్ మొదటిసారి నటిస్తున్న పాన్ ఇండియా సినిమా ‘దాస్ కా ధమ్కీ’. తన సొంత దర్శకత్వంలో, ప్రొడక్షన్ లో విశ్వక్ సేన్ చేస్తున్న ఈ మూవీ షూటింగ్ రీసెంట్ గా కంప్లీట్ అయ్యింది. నిజానికి ఫిబ్రవరి 17నే ‘దాస్ కా ధమ్కీ’ రిలీజ్ అవ్వాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. కొత్త రిలీజ్ డేట్ ఇంకా అఫీషియల్ గా ప్రకటించలేదు కానీ ఇప్పుడున్న ఇండస్ట్రీ టాక్ ని బట్టి చూస్తే ‘దాస్ కా ధమ్కీ’ సినిమా మార్చ్ 22న రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉగాది పండగ రోజున, మిడ్ వీక్ లో ‘దాస్ కా ధమ్కీ’ సినిమాని విడుదల చేసి లాంగ్ వీకెండ్ ని కాష్ చేసుకోవాలని విశ్వక్ సేన్ ప్లాన్ చేస్తున్నాడు. రిలీజ్ కి ఇంకో మూడు వారాలే సమయం ఉండడంతో విశ్వక్ సేన్, ‘దాస్ కా ధమ్కీ’ ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచుతున్నాడు.

ఇప్పటికే ‘దాస్ కా ధమ్కీ’ సినిమా నుంచి రెండు సాంగ్స్ రిలీజ్ చేసిన విశ్వక్ సేన్, లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి ‘ఓ డాలర్ పిల్లగా’ అనే సాంగ్ ని రిలీజ్ చేస్తున్నట్లు అఫీషియల్ గా అనౌన్స్ చేశాడు. మార్చ్ 6న వైజాగ్ లోని గీతం యూనివర్శిటీలో సాంగ్ లాంచ్ ఈవెంట్ చెయ్యనున్నారు. ఇదిలా ఉంటే మార్చ్ 18న జరగనున్న ‘దాస్ కా ధమ్కీ’ ప్రీరిలీజ్ ఈవెంట్ కి ఎన్టీఆర్ చీఫ్ గెస్టుగా వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఎన్టీఆర్ అంటే విశ్వక్ సేన్ కి చాలా ఇష్టం… ఆ ఇష్టంతోనే విశ్వక్ సేన్, ఎన్టీఆర్ ని ఇన్వైట్ చేసాడట. ఎన్టీఆర్ రావడం అంటూ జరిగితే ‘దాస్ కా ధమ్కీ’ ప్రీరిలీజ్ ఈవెంట్ పర్ఫెక్ట్ పాన్ మూమెంట్స్ ఇచ్చే స్టేజ్ అవుతుంది.

Show comments