Simhadri: ఏ ముహూర్తాన రీ రిలీజ్ ట్రెండ్ మొదలయ్యిందో కానీ, మాములు రిలీజ్ లు కంటే.. రీ రిలీజ్ లే ఎక్కువ హైప్ క్రియేట్ చేస్తున్నాయి. ముఖ్యంగా ఫ్యాన్స్ అయితే ఈ రీరిలీజ్ హంగామా మరింత ఎక్కువగా చేస్తున్నారు అని నెటిజన్లు చెప్పుకొస్తున్నారు. ఒక హీరో బర్త్ డే కో, ఆ సినిమా రిలీజ్ అయ్యి ఇన్నేళ్లు అవుతుందో అనో..గుర్తుగా రీరిలీజ్ లను ప్లాంక్. కానీ, దాన్ని మరిచి అభిమానులు.. ఆ హీరో సినిమాను రీరిలీజ్ చేశారు.. మా హీరో సినిమాను చేయండి అంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటివరకు రీ రిలీజ్ అయినసినిమాలు కలెక్షన్స్ రాబట్టాయో లేదో తెలియదు కానీ, అభిమానులు చేసే అతి ఎక్కువ అయ్యిందన్న మాటలువినిపిస్తున్నాయి. థియేటర్ లో విరగ్గొట్టడం, స్క్రీన్ కు నిప్పు అంటించడం, థియేటర్ లో బాంబ్ లు పేల్చడం చేస్తూ.. మితిమీరిన అభిమానాన్ని చూపిస్తూ థియేటర్ ఓనర్స్ కుచుక్కలు చూపిస్తున్నారు. దీని వలన రీ రిలీజ్ లు వేయలేమని థియేటర్ ఓనర్లు చెప్పుకొచ్చేస్తున్నారు. ఇక తాజాగా ఎన్టీఆర్- రాజమౌళి కాంబోలో వచ్చిన సింహాద్రి రీ రిలీజ్ కు సిద్దమవుతున్న విషయం తెల్సిందే.
Adah Sharma: ఆ వివాదం ఏమో కానీ.. ఈ చిన్నదానికి ఇన్నాళ్లకు స్టార్ డమ్ వచ్చింది
ఇక రీ రిలీజ్అని తెలిసినప్పటి నుంచి ఫ్యాన్స్ చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. రీ రిలీజ్ అంటే.. ఆ సినిమా రిలీజ్ అయ్యే రోజు కటౌట్స్ పెట్టి రచ్చ చేయడం చూస్తూనే ఉన్నాం. అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కొద్దిగా అడ్వాన్స్ అయ్యి.. కొత్త సినిమాను రిలీజ్ చేసినట్లే.. ఈ సినిమాను కూడా రిలీజ్ చేయడానికి రెడీ అయ్యరు. నేడు సుదర్శన్ థియేటర్ లో సింహాద్రి సినిమాలోని నువ్వు విజిలేస్తే ఆంధ్రా సోడాబుడ్డి సాంగ్ లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. ఈ సాంగ్ రిలీజ్ కే ఫ్యాన్స్ చేసిన హంగామా అంత అయినంత కాదు. థియేటర్ వద్ద ఎన్టీఆర్ కటౌట్ పెట్టి.. రచ్చ రచ్చ చేశారు. ఆ సాంగ్ కు డ్యాన్స్ వేస్తూ రోడ్డు మీద ట్రాఫిక్ జామ్ అయ్యేలా చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. కొత్త సినిమాకు కూడా ఇలా చేయరు కదా .. ఎందుకయ్యా ఇదంతా అని కొందరు.. మరి కొంచెం అతిగా ఉంది బ్రో అని ఇంకొందరు చెప్పుకొస్తుండగా.. ఎన్టీఆర్ అభిమానులా .. మజాకా అని ఇంకొందరు చెప్పుకొస్తున్నారు. ఇక ఈ సినిమా రీ రిలీజ్ డేట్ ను త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.