Nuvvu Nenu Song from Radha Madhavam Released: గ్రామీణ ప్రేమ కథలో ఓ సహజత్వం ఉంటుంది, అలాంటి సహజత్వం ఉట్టిపడేలా ‘రాధా మాధవం’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు మేకర్స్. విలేజ్ లవ్ స్టోరీలకు ఎప్పుడూ ఆడియన్స్ నుంచి సపోర్ట్ వస్తూనే ఉంటుంది, అలాంటి ఓ గ్రామీణ ప్రేమ కథా చిత్రమే రాబోతోంది. వినాయక్ దేశాయ్, అపర్ణా దేవీ హీరో హీరోయిన్లుగా గోనాల్ వెంకటేష్ నిర్మిస్తున్న అందమైన ప్రేమ కథా చిత్రమే ఈ ‘రాధా మాధవం’. ఈ మూవీకి దాసరి ఇస్సాకు దర్శకత్వం వహించగా . వసంత్ వెంకట్ బాలా కథ, మాటలు, పాటలను అందించారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించింది. రీసెంట్‌గా ఈ మూవీ ఫస్ట్ లుక్ మూవీ పోస్టర్‌ను రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది.
Salaar : యూట్యూబ్ లో ట్రెండ్ అవుతున్న సలార్ మేకింగ్ వీడియో..
అంతే కాకుండా బిగ్ బాస్ సోహెల్ రీసెంట్‌గా ‘నేల మీద నేను ఉన్నా’ అంటూ సాగే ఈ పాటను విడుదల చేయగా అది కూడా శ్రోతలను ఇట్టే ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు మరో పాటను సినిమా యూనిట్ విడుదల చేసింది. ‘నువ్వు నేను’ అంటూ సాగే ఈ పాటను వసంత్ వెంకట్ బాలా రాయగా సమీరా భరద్వాజ్, రవి.జీ ఆలపించారు. కొల్లి చైతన్య ఇచ్చిన బాణీలు ఎంతో వినసొంపుగా ఉంది. త్వరలోనే మరిన్ని అప్డేట్లతో చిత్రయూనిట్ ప్రేక్షకుల ముందుకు రానుందని మేకర్స్ చెబుతున్నారు. ఇక జనవరి నెలలోనే ఈ మూవీని విడుదల చేసేందుకు సినిమా యూనిట్ ప్లాన్ చేస్తోంది. మేక రామకృష్ణ, జయ ప్రకాష్, ప్రియ, నవీన్, రవి శివతేజ, సుమన్, రాచర్ల లాస్య, ధనుష్ ఆచార్య, రాచర్ల మహేష్, శ్రీకాంత్ పర్కాల, సతీష్ కొల్లిపల్లి, శ్రీను, అడెపు మణిదీప్, చిరంజీవి, కామనగరి జ్యోతి, సురభి శ్యామల తదితరులు నటిస్తున్నారు.