కరోనా కారణంగా సినిమాలు ఆగిపోవటం, దాని వల్ల లాక్ డౌన్ ఎత్తేయగానే హుటాహుటిన సెట్స్ మీదకు పరుగులు తీయటం… బాలీవుడ్ లో ఎక్కడ చూసినా ఇప్పుడు ఇదే సీన్! అయితే, మహమ్మారిని తప్పించుకుంటూ మహా వేగంగా షూటింగ్ లు చేయటం చాలా పెద్ద మానసిక ఒత్తిడి! నటీనటులు, టెక్నీషియన్స్ అందరూ అలాంటి ప్రెజర్ కి లోనవుతున్నారు కూడా…
Read Also : ధనుష్ రికార్డ్ పై మహేశ్ కన్ను
దర్శకుడు లవ్ రంజన్ రూపొందిస్తోన్న ఓ సినిమాలో నటిస్తోన్న నుస్రత్ బరూచా ఆసుపత్రి పాలు కావాల్సి వచ్చింది. హఠాత్తుగా ఆమె బీపీ డౌన్ అవ్వటంతో హాస్పిటల్ కి తీసుకెళ్లారు. కనీసం ఆమె లేచి లోపలికి వెళ్లే స్థితి కూడా లేకపోవటంతో వీల్ చెయిర్ లో ముంబైలోని హిందూజా హాస్పిటల్ ఐసీయూలోకి తీసుకెళ్లినట్టు సమాచారం. ప్రస్తుతం నుస్రత్ కండీషన్ స్టేబుల్ గానే ఉంది. అయితే, ఆమెకు తీవ్రమైన మానసిక, శారీరిక ఒత్తిడి వల్ల వెర్టిగో అటాక్ వచ్చింది. రక్త ప్రసరణపై ప్రభావం పడి కళ్లు తిరిగినట్టు అనిపించటం, చాలా బలహీనంగా అయిపోవటం ‘వెర్టిగో అటాక్’ లక్షణాలు. గత కొన్ని రోజులుగా నుస్రత్ ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నప్పటికీ విషయం బయటకు రాలేదు. ఆమె తల్లిదండ్రులకి కూడా నుస్రత్ బరూచా హాస్పిటల్ లో చేరాకే చిత్ర బృందం సమాచారం అందించారట. డాక్టర్స్ సలహా మేరకు మరికొన్ని రోజులు బరూచా బెడ్ రెస్ట్ లోనే ఉండబోతోంది. వారం లేదా రెండు వారాల తరువాత మళ్లీ సినిమా షూటింగ్ మొదలు కావచ్చు.
