Site icon NTV Telugu

“ఎన్టీఆర్30” కోసం తమిళ మ్యూజిక్ డైరెక్టర్ ?

Koratala Siva pens a powerful political drama for Jr NTR?

ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాన్ని త్వరలోనే పూర్తి చేయబోతున్నారు. ఈ సినిమా అక్టోబర్ 13న పేక్షకుల ముందుకు రానుంది. ఆ తరువాత కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ నెక్స్ట్ మూవీ ఉంటుంది. 2016లో వచ్చిన “జనతా గ్యారేజ్” చిత్రం తర్వాత ఎన్టీఆర్, అనిరుధ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం కావడంతో సినిమాపై భారీగా అంచనాలు పెరిగిపోయాయి. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ ప్రాజెక్ట్ ను ప్రస్తుతానికి ‘ఎన్‌టిఆర్30’ అనే వర్కింగ్ టైటిల్ తో పిలుస్తున్నారు. “ఆర్ఆర్ఆర్” పూర్తవ్వగానే అంటే ఈ ఏడాది చివర్లో ఈ మూవీ సెట్స్ పైకి వెళ్తుందని భావిస్తున్నారు. “ఎన్టీఆర్ 30″ను ఎన్‌టీఆర్ ఆర్ట్స్ సహకారంతో యువసుధ ఆర్ట్స్ పతాకంపై సుధాకర్ మిక్కిలినేని, నందమూరి కళ్యాణ్ రామ్ సంయుక్తంగా నిర్మిస్తుంచనున్నారు.

Read Also : పవన్ ఫ్యాన్స్ కు డబుల్ ట్రీట్

ఇతర తారాగణం వివరాలు ఇంకా ప్రకటించలేదు. ప్రస్తుతం మేకర్స్ అదే పనిలో ఉన్నారు. అయితే ఈ సినిమా కోసం ఓ ప్రముఖ తమిళ దర్శకుడిని తీసుకోబోతున్నారనే ప్రచారం జోరందుకుంది. తాజా సమాచారం ప్రకారం “ఎన్‌టిఆర్30” కోసం యంగ్ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్‌ను తీసుకురావాలని కొరటాల శివ ఆలోచన అట. ఈ మూవీ మ్యూజిక్ డైరెక్టర్‌గా యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్‌ని ఫైనల్ చేసినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. అయితే ఈ సినిమాకి అనిరుధ్ 4.50 కోట్లు కోట్ చేశాడట. యూనిట్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఈ న్యూస్ ఎప్పటి నుంచి సోషల్ మీడియాలో తిరుగుతున్నప్పటికీ తాజాగా ట్విట్టర్ లో “ఎన్టీఆర్ 30” ట్రెండ్ అవుతోంది. అదికూడా అనిరుద్ కారణంగా…! ఇంతకుముందు అనిరుధ్ తెలుగులో ‘అజ్ఞాతవాసి’, ‘గ్యాంగ్ లీడర్,‘ జెర్సీ’ వంటి తెలుగు చిత్రాలకు స్వరాలు సమకూర్చిన విషయం తెలిసిందే.

Exit mobile version