Site icon NTV Telugu

NTR: అల్లు అర్జున్ బావ.. ఎన్టీఆర్ బావ.. ఏందీ బ్రో కొత్త పిలుపులు

Ntr

Ntr

NTR: మేము మేము బాగానే ఉంటాం.. మీరే మారాలి అని ఒక స్టేజిపై మహేష్ బాబు చెప్పిన మాటలు గుర్తున్నాయా. హీరోలు హీరోలు అందరూ బాగానే కలిసిమెలిసి ఉంటారు. వారి పేర్లు చెప్పుకొని అభిమానులు కొట్టుకుంటూ ఉంటారు. ఇక ఈ సోషల్ మీడియా వచ్చాక ఈ ట్విట్టర్ వార్ లు మరింత ఎక్కువ అయ్యాయి. ఒక హీరో అభిమానులు ఇంకొక హీరోను విమర్శించడం, ట్రోల్స్ వేయడం, మీమ్స్ వేయడం చూస్తూనే ఉన్నాం. అభిమానుల ట్రోల్స్ తో మాకు పనిలేదు.. అని హీరోలందరూ కలిసిమెలిసి టాలీవుడ్ ఖ్యాతిని పెంచుకుంటూ వెళ్తున్నారు. ఒకరి సినిమా హిట్ అయితే ఇంకో హీరో ట్వీట్ చేయడం, చిన్న హీరోలకు స్టార్ హీరోలు సపోర్ట్ గా ఉండడం, ఒకరి పుట్టినరోజుకు ఇంకొకరు విష్ చేయడం చేస్తూ అభిమానులను.. ఈ గొడవలు ఆపేయండి అని ఇన్ డైరెక్ట్ గా హింట్ ఇస్తున్నారు. ఇక నేడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు అన్న విషయం తెల్సిందే. ఉదయం నుంచి అభిమానులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా బన్నీకి విషెస్ తెలుపుతున్నారు.

Kriti Sanon: ప్రభాస్ రూమర్డ్ గర్ల్ ఫ్రెండ్ తో షాహిద్ సరసాలు

ఇక తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్.. బన్నీకి స్పెషల్ గా బర్త్ డే విషెస్ చెప్పాడు. అయితే ప్రస్తుతం ఈ విషెస్ నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి. ఎందుకు అంత స్పెషల్ అంటే.. బన్నీని, ఎన్టీఆర్ బావ అని పిలవడమే.. ” పుట్టినరోజు శుభాకాంక్షలు బావ.. అల్లు అర్జున్” అంటూ రాసుకొచ్చాడు. అంతే ఈ ఒక్క మాటతో ట్విట్టర్ లో మరో వార్ మొదలయ్యింది. వీరిద్దరూ ఇండస్ట్రీలో మంచి స్నేహితులు అని తెలుసు. చరణ్ కు బన్నీ బావ.. చరణ్ ను తాను బ్రదర్ గా చూస్తున్నాడు కాబట్టి బన్నీని బావ అన్నాడా..? లేక నార్మల్ గానే వీరిద్దరూ బావ బామ్మర్దులు అని పిలుచుకుంటారా..? అనేది తెలియదు. ఇక ఎన్టీఆర్ ట్వీట్ కు స్పందించిన అల్లు అర్జున్ సైతం ” లవ్లీ విషెస్ తెలిపినందుకు థాంక్స్ బావ.. వార్మ్ హగ్స్” అంటూ చెప్పుకొచ్చాడు. ఇక అభిమానులు మాత్రం ఏందీ బ్రో కొత్త పిలుపులు .. ఏంటి సంగతి అని కామెంట్స్ పెడుతున్నారు. ఇక ఇంకొంతమంది వాళ్ళు వాళ్ళు బాగానే ఉంటారు.. మీరు కూడా మారండి అంటూ హితబోధ చేస్తున్నారు.

Exit mobile version