NTR: నవరస నట సార్వభౌమ నందమూరి తారక రామారావు నట వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని తిరుగులేని గ్లోబల్ స్టార్ గా ఎదుగుతున్నాడు జూనియర్ ఎన్టీఆర్. తాత, బాబాయ్ లానే పాత్ర ఏదైనా అందులోకి ఎన్టీఆర్ దిగనంతవరకే.. ఒక్కసారి అందులోకి పరకాయ ప్రవేశం చేశాడా..? అవార్డులు, రివార్డులు వెతుక్కుంటూ రావాల్సిందే. హీరో, విలన్.. దేనికైనా రెడీ అంటాడు ఎన్టీఆర్. నిజం చెప్పాలంటే.. ఒకప్పుడు హీరోలు అంటే.. ఇలాంటి పాత్రలు మాత్రమే చేయాలి అని గిరీ గీసుకొని కూర్చొనేవారు. కానీ, ఇప్పుడు హీరోలు అలా లేరు.. కొత్త కొత్త పాత్రలు చేయడంలో ముందు ఉంటున్నారు. మంచి కథ అయితే హీరోగానే కాదు విలన్ గా, సపోర్టివ్ క్యారెక్టర్స్ లోనూ కనిపించి మెప్పిస్తున్నారు. ఇక ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ గా మారడమే కాకుండా బాలీవుడ్ ఎంట్రీ కూడా సెట్ చేసిన విషయం తెల్సిందే. వార్ 2 లో హృతిక్ రోషన్ తో పాటు ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్నాడు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన వార్ కు సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది.
PKSDT: ‘బ్రో’.. దేవుడు టైమ్ స్టార్ట్ అయ్యిందిరోయ్
ఇకపోతే త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమాకు సంబంధించిన ఒక రూమర్ ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. అదేంటంటే.. ఈ సినిమాలో ఎన్టీఆర్ .. నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నాడట. ఇప్పటికే జై లవకుశ సినిమాలో ఎన్టీఆర్ తన విలనిజాన్ని చూపించి మెప్పించాడు. ఇక ఇప్పుడు బాలీవుడ్ లో సైతం తన నెగెటివ్ షేడ్స్ చూపించడానికి సిద్దమవనున్నాడట. హృతిక్ కు ఏ మాత్రం తీసిపోని పాత్రలో ఎన్టీఆర్ కనిపిస్తున్నాడని అంటున్నారు. ఈ వార్తలో నిజం ఎంతో తెలియదు కానీ, ఇదే కనుక నిజమైతే అభిమానులకు పూనకాలే అని చెప్పొచ్చు. ఇకపోతే ప్రస్తుతం ఎన్టీఆర్, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎన్టీఆర్ 30 సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా పూర్తి అయ్యాకా వార్ 2 సెట్స్ మీదకు వెళ్లనుంది.
