Site icon NTV Telugu

Amigos: ఫ్యామిలీతో కలిసి అమిగోస్ స్పెషల్ ప్రీమియర్ చూసిన ఎన్టీఆర్…

Amigos

Amigos

నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘అమిగోస్’. ముగ్గురు లుక్ ఎ లైక్స్ క్యారెక్టర్స్ ని ప్లే చేస్తున్న కళ్యాణ్ రామ్ అమిగోస్ సినిమాలో చాలా కొత్తగా కనిపించబోతున్నాడు. డైరెక్టర్ రాజేంద్ర ఈ మూవీ కోసం పెట్టిన ఎఫోర్ట్స్ ఇప్పటివరకూ రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ లో కనిపిస్తుంది. టీజర్, ట్రైలర్, సాంగ్స్ తో పాజిటివ్ బజ్ ని జనరేట్ చేసిన అమిగోస్ చిత్ర యూనిట్ ఫిబ్రవరి 10న హిట్ కొత్తబోతున్నాం అనే కాన్ఫిడెన్స్ లో ఉన్నారు. నందమూరి అభిమానులు కూడా కళ్యాణ్ రామ్ కి హిట్ ఇవ్వడానికి రెడీ గా ఉన్నారు. ఇప్పుడున్న హైప్ కి కాస్త పాజిటివ్ టాక్ తోడైతే చాలు కళ్యాణ్ బ్యాక్ టు బ్యాక్ సెకండ్ హిట్ కొట్టేసినట్లే అవుతుంది. మరి కొన్ని గంటల్లో రిలీజ్ కానున్న అమిగోస్ సినిమాని యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఫ్యామిలీతో పాటు స్పెషల్ షో వేసుకోని చూశాడు.

నందమూరి ఫ్యామిలీ మొత్తం అటెండ్ అయిన ఈ స్పెషల్ షో నుంచి హిట్ టాక్ బయటకి వస్తుంది. ఎన్టీఆర్ కూడా అమిగోస్ సినిమా బాగుంది, చూడండి అని ఒక ట్వీట్ చేస్తే చాలు ఎన్టీఆర్ ఫాన్స్ థియేటర్స్ కి క్యు కడతారు. ఎన్టీఆర్ పాజిటివ్ రివ్యూ ఇస్తూ కామన్ ఆడియన్స్ కు అమిగోస్ సినిమాని చూడడానికి థియేటర్స్ కి వస్తారు. అయితే ఇప్పటివరకూ ఎన్టీఆర్ నుంచి సినిమా చూడండి అని అనే పోస్ట్ రాలేదు. మూవీ బాగుంటే హియరింగ్ గుడ్ థింగ్స్ అనో, థియేటర్ కి వెళ్లి సినిమా చూడండి అనో ట్వీట్ చేస్తాడు కానీ ఇది “మా అన్న సినిమా, నేను చూసాను మీరు చూడండి” అనే మాట మాత్రం చెప్పడు. మౌత్ టాక్ స్ప్రెడ్ అయితే సినిమాని ఎవరూ ఆపలేరు అనే నమ్మకం ఏమో ఎన్టీఆర్ నుంచి ఇలాంటి ట్వీట్ తన సినిమా గురించి కూడా బయటకి రాదు. ఒకవేళ ఇప్పుడు అమిగోస్ సినిమా గురించి ఎన్టీఆర్ పాజిటివ్ రివ్యూ ఇస్తూ ఒక్క  ట్వీట్ చేస్తే చాలు రేపు బాక్సాఫీస్ దగ్గర కళ్యాణ్ రామ్ కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్ ని చూడడం గ్యారెంటి.

Exit mobile version