Site icon NTV Telugu

WAR 2: ఎన్టీఆర్-హృతిక్ మధ్య ట్వీట్ వార్.. ఎందుకంటే..?

War2 (2)

War2 (2)

WAR 2: ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబోలో వస్తున్న మూవీ వార్-2. భారీ బడ్జెట్ తో అయాన్ ముఖర్జీ ఈ మూవీని డైరెక్ట్ చేశాడు. పాన్ ఇండియా సినిమాగా వస్తున్న వార్-2 ఆగస్ట్ 14న రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్, హృతిక్ మధ్య వార్ ఉంటుందనేది తెలిసిందే. తాజాగా వీరిద్దరూ ట్విట్టర్ లో ఒకరిపై ఒకరు చేసుకున్న ట్వీట్లు ఇప్పుడు అందరికీ షాకింగ్ గా అనిపిస్తున్నాయి. ముందుగా హృతిక్ రోషన్ ట్విట్టర్ లో ఓ ట్వీట్ వేశారు. ఇక నుంచి వార్ మొదలవుతోంది. అందరూ ట్విట్టర్ లో ‘#HrithikvsNTR’ హ్యాష్ ట్యాగ్ ను ఫాలో అవండి. ఇక నుంచి ఈ హ్యాష్ టాగ్ తోనే మూవీకి సంబంధించిన విషయాలను పంచుకుంటాను అన్నారు హృతిక్. దానికి ఎన్టీఆర్ రిప్లై ఇస్తూ.. మీరు సినిమా విషయాలను పంచుకుంటే ‘#NTRvsHrithik’ హ్యాష్‌ టాగ్ తోనే పంచుకోవాలని ముందే అనుకున్నాం కదా అని కామెంట్ చేశారు.

Read Also : Sonusood : ఫిష్ వెంకట్ కుటుంబాన్ని కలిసిన సోనూసూద్

దానికి హృతిక్ స్పందిస్తూ.. మీరు చెప్పేది బాగానే ఉంది తారక్. కానీ హ్యాష్ టాగ్ మాత్రం నాదే యూజ్ చేయాలి. దీన్ని ఇక్కడితో ఆపేయండి. పెద్దది చేయొద్దు అన్నారు. ఎన్టీఆర్ రిప్లై ఇస్తూ.. మీరు నేను చెప్పేది కరెక్ట్ అన్నారంటే నేను గెలిచనట్టే హృతిక్ సార్ అంటూ రిప్లై ఇచ్చారు. ఇలా వీరిద్దరి మధ్య ఫన్నీ ట్రాక్ నడిచింది. ఇది చూసిన ఇరువురి ఫ్యాన్స్ తెగ కామెంట్లు పెట్టేస్తున్నారు. వార్-2 ట్రైలర్ మంచి అంచనాలను పెంచేసింది. త్వరలోనే ప్రమోషన్లు మొదలు పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందులో ఎన్టీఆర్, హృతిక్ మధ్య వచ్చే ఫైట్ సీన్స్ కోసం ఫ్యాన్స్ ఆతృతగా వెయిట్ చేస్తున్నారు.

Read Also : Coolie : రజినీకాంత్ అలా అనేసరికి షాక్ అయ్యా.. నాగార్జున కామెంట్స్

Exit mobile version