కొరటాల శివ దర్శత్వంలో పాన్ ఇండియా బాక్సాఫీస్ ని టార్గెట్ చేస్తూ ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా దేవర. ఏప్రిల్ 5న రిలీజ్ అవుతుంది అనుకున్న ఈ యాక్షన్ సినిమా వాయిదా పడుతుందనే టాక్ సోషల్ మీడియాలో వినిపిస్తోంది. ఈ వార్తపై మేకర్స్ నుంచి ఎలాంటి అఫీషియల్ అప్డేట్ లేదు కానీ ఎన్నికల సమయంలో దేవర రిలీజ్ అయ్యే అవకాశమే లేదనేది వాస్తవం. దేవర వాయిదా విషయానికి సైఫ్ కూడా కారణం అయ్యాడు. ఇటీవలే జరిగిన దేవర షూటింగ్ లో సైఫ్ అలీ ఖాన్ కి ఇంజ్యురీ అయ్యింది. హ్యాండ్ సర్జరీ కంప్లీట్ అయిన తర్వాత సైఫ్ అలీ ఖాన్ ఇంటికి పరిమితం అయ్యాడు. సైఫ్ కోలుకున్న తర్వాతే దేవర బాలన్స్ షూటింగ్ కంప్లీట్ అవుతుంది. సర్జరీ కాబట్టి సైఫ్ షూటింగ్ లో పాల్గొనడానికి సమయం పడుతుంది. ఈ కారణంగా దేవర షూటింగ్ డిలే అవ్వడం గ్యారెంటీ.
దేవర డిలే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని కంగారు పెడుతుంటే హ్రితిక్ ఫ్యాన్స్ ని మాత్రం ఖుషి చేస్తుంది. హ్రితిక్ నటించిన లేటెస్ట్ సినిమా ఫైటర్… సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా వారం తిరిగే లోపే బాక్సాఫీస్ దగ్గర సౌండ్ లేకుండా కంప్లీట్ మ్యూట్ అయిపొయింది. ఇప్పుడు హ్రితిక్ బౌన్స్ బ్యాక్ అవ్వాలి అంటే వార్ 2 సినిమా హిట్ అవ్వాల్సిందే. వార్ సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కుతున్న వార్ 2లో ఎన్టీఆర్ నటిస్తున్నాడు. హ్రితిక్ రోషన్ vs ఎన్టీఆర్ గా వార్ 2 సినిమా రూపొందుతుంది. ఇప్పటికే రెగ్యులర్ షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా సెట్స్ లో ఎన్టీఆర్ జాయిన్ అవ్వలేదు. దేవర కంప్లీట్ అయ్యాక ఎన్టీఆర్ వార్ 2 సెట్స్ కి వెళ్తాడని అంతా అనుకున్నారు. ఇప్పుడు సైఫ్ కి యాక్సిడెంట్ అవ్వడంతో… అతను కోలుకునే లోపు వార్ 2 షూటింగ్ లో పాల్గొనడానికి ఎన్టీఆర్ రెడీ అవుతున్నాడని సమాచారం. దీంతో ఊహించిన దానికన్నా ముందే వార్ 2 స్టార్ట్ అవుతుంది అంటూ బీటౌన్ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. అలా సైఫ్ యాక్సిడెంట్ హ్రితిక్ రోషన్ కి కలిసొచ్చి వార్ 2 సినిమా షూటింగ్ స్టార్ట్ అవనుంది.