NTV Telugu Site icon

NTR Temper: దయాగాడి దండయాత్రకి తొమ్మిదేళ్లు…

Temper

Temper

యౌంగ్ టైగర్ ఎన్టీఆర్ అంటే ఈరోజు గ్లోబల్ స్టార్ ఇమేజ్ ఉన్న హీరో, పాన్ ఇండియా బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటి ఎన్టీఆర్ సొంతం. ఇండియా నుంచి జపాన్ వరకూ ఎన్టీఆర్ ఇమేజ్ స్ప్రెడ్ అయ్యి ఉంది. ఇదంతా ఈరోజు, దశ్బ్దం క్రితం ఇలా లేదు. సరిగ్గా చెప్పాలి అంటే తోమిదేళ్ల క్రితం ఎన్టీఆర్ పరిస్థితి వేరు. ఎన్టీఆర్ అభిమాని అని చెప్పుకోవడానికి కూడా ఫాన్స్ ఇబ్బంది పడిన రోజులు ఉన్నాయి. 19 ఏళ్లకే స్టార్ హీరో అయిన ఎన్టీఆర్, ఆ తర్వాత 2010లో బ్యాక్ టు బ్యాక్ రెండు హిట్స్ కొట్టాడు. ఈ తర్వాత మూడున్నర ఏళ్ల పాట్టు ఎన్టీఆర్ కి హిట్ అనే మాటే లేదు. ఏ మూవీ చేసినా, ఏ డైరెక్టర్ తో వర్క్ చేసినా అది బాక్సాఫీస్ దగ్గర డిజప్పాయింట్ చేస్తూనే ఉంది. ఎన్టీఆర్ ఈ సినిమాతో అయినా హిట్ ఇస్తాడా అని ఎదురు చూడని అభిమాని లేడు. ఒక్క హిట్ కొట్టు అన్నా అని కోరుకోని అభిమాని లేడు అంటే అతిశయోక్తి లేదు. ఎంతో ఆశగా థియేటర్స్ కి వెళ్లి ఎన్టీఆర్ అభిమానులు నీరసంగా తల ఒంచుకోని బయటకి వచ్చిన రోజులు అవి. రిలీజ్ అవుతున్న ప్రతి సినిమా ట్రోల్ చేస్తున్న వారికి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి కూడా మాటలు లేకుండా చేస్తున్నాయి. ఆఖరికి ఎన్టీఆర్ యాక్టింగ్ లో కూడా మొనాటమి వచ్చేసింది అనే కామెంట్స్ కూడా వినిపించేసాయి. అంతేనా? ఎన్టీఆర్ పని అయిపోయిందా? ఇక హిట్ అనే మాట ఎన్టీఆర్ కెరీర్ లో వినిపించదా? ఎన్టీఆర్ అభిమానులు మిగిలిన హీరోల అభిమానుల ముందు తల ఒంచుకోని ఉండాల్సిందేనా? తమ హీరోని వాళ్లు కామెంట్స్ చేస్తుంటే సైలెంట్ గా ఉండాల్సిందేనా? అసలు ఎన్టీఆర్ హిట్ ఎప్పుడు కొడతాడు? కంబ్యాక్ ఎప్పుడు ఇస్తాడు? ఈ ప్రశ్నలకి సమాధానం దొరికింది… 2015లో…

2015లో ఎన్టీఆర్-పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో సినిమా అనౌన్స్ చేశాడు. టెంపర్ అనే టైటిల్ తో అనౌన్స్ అయిన ఈ మూవీకి అనుప్ మ్యూజిక్ డైరెక్టర్, మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, హీరోయిన్ కాజల్ అగర్వాల్. హీరో ఫ్లాప్స్ లో ఉన్నాడు, డైరెక్టర్ ఫ్లాప్స్ లో ఉన్నాడు, మణిశర్మ ఫామ్ లో లేడు. ఎన్టీఆర్ ఖాతాలో మరో ఫ్లాప్ పడుతుందా? ఎన్టీఆర్ ఫాన్స్ కి మరోసారి డిజప్పాయింట్మెంట్ తప్పదా? అసలు ఎన్టీఆర్ కి ఏం అయ్యింది ఫ్లాప్స్ ఉన్న డైరెక్టర్ కి సినిమా ఇచ్చాడు. లో ఫేజ్ లో ఉన్నప్పుడు హిట్ స్ట్రీక్ లో ఉన్న డైరెక్టర్ తో సినిమా చెయ్యొచ్చు కదా అనే మాటలు మొదలయ్యాయి. ఈ కామెంట్స్ ని పట్టించుకోకుండానే టెంపర్ సినిమా షూటింగ్ ని చేసేస్తున్నాడు పూరి జగన్నాథ్. ఫిబ్రవరి 13న రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు, ప్రమోషన్స్ ని స్టార్ట్ చెయ్యాలి కదా. అసలు ఎక్స్పెక్టేషన్స్, జీరో బజ్ ఉన్న చోట టెంపర్ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది. ఎన్టీఆర్ నెవర్ బిఫోర్ సిక్స్ ప్యాక్ లో కనిపించాడు. నందమూరి అభిమానుల దృష్టి సడన్ గా టెంపర్ మూవీపై షిఫ్ట్ అయ్యింది. ఇదే సమయంలో టీజర్ ఒకటి బయటకి వచ్చింది… “దేవుడు అందరి సరదా తీర్చెస్తాడు, నా సరదా కూడా తీర్చేసాడు… అయినా మారుతాను అనే గ్యారెంటీ లేదు” అనేది డైలాగ్. ఈ ఒక్క డైలాగ్ తో టెంపర్ సినిమా హైప్ అమాంతం పెరిగింది. ముఖ్యంగా టీజర్ ఎండ్ లో ఎన్టీఆర్ ఇచ్చిన ఈవిల్ స్మైల్, రాబోయే హిట్ ని నిదర్శనంలా కనిపించింది. సిక్స్ ప్యాక్ లో ఎన్టీఆర్, పూరి మార్క్ క్యారెక్టరైజేషణ్, టీజర్ ని మణిశర్మ ఇచ్చిన అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్… అన్ని ఎలిమెంట్స్ కలిసి టెంపర్ సినిమాపై మంచి బజ్ ని క్రియేట్ చేశాయి.

జనవరి 28… రోజున టెంపర్ ఆడియో లాంచ్ జరిగింది. కళ్యాణ్ రామ్ కూడా గెస్ట్ గా వచ్చిన ఈ ఈవెంట్ లో, ఎన్టీఆర్ నందమూరి అభిమానుల సమక్షంలో తన గత సినిమాల ఫెయిల్యూర్స్ ని ఒప్పుకుంటూ ఇచ్చిన స్పీచ్ లోని ప్రతి పదం ఈరోజుకీ ఫాన్స్ కి గుర్తుండే ఉంటుంది. ఎన్టీఆర్ కన్నా ముందు మైక్ తీసుకున్న పూరి జగన్నాథ్… “ఇతను మీ ఎన్టీఆర్ కాదు, నందమూరి ఫ్యామిలీ నుంచి మేము లాంచ్ చేస్తున్న ఒక కొత్త హీరో” అని చెప్పాడు. నిజమే ఎన్టీఆర్ ఆరోజు మళ్లీ కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చినట్లు అనిపించాడు. 19 ఏళ్లకే స్టార్ హీరో అయిన ఇమేజ్ వెయిట్ ని వదిలేసి ఎన్టీఆర్, కొత్తగా మళ్లీ కెరీర్ ని స్టార్ట్ చేశాడు. పూరి తర్వాత మైక్ తీసుకున్న ఎన్టీఆర్… “నందమూరి అభిమానులు కాలర్ ఎగరేసుకునే సినిమాలు చేస్తాను” అని చెప్పాడు. ఇది మాములు స్పీచ్ లా కాకుండా ఒక ప్రామిస్ లా నిలబెట్టుకున్నాడు ఎన్టీఆర్. ఆ క్షణం ఎన్టీఆర్ చెప్పిన మాట, ఎన్టీఆర్ అనే పేరుని ప్రపంచం మొత్తం పరిచయం అయ్యేలా చేసింది.

ఎన్టీఆర్ హిట్ ఇస్తాను అని మాట ఇచ్చాడు, ట్రైలర్ లో ఇది దయా గాడి దండయాత్ర అని చెప్పాడు, సిక్స్ ప్యాక్ లో సూపర్ ఉన్నాడు… ఫ్లాప్ స్ట్రీక్ ఈరోజు అయినా బ్రేక్ అవుతుందా అనే ఆలోచనతో నందమూరి అభిమానులు ఫిబ్రవరి 13న థియేటర్స్ లోకి ఎంటర్ అయ్యారు. ఈ మూవీ స్టార్ట్ అయిన రెండు నిమిషాలకే, బీచ్ లో ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ అవ్వగానే ప్రతి ఒక్కరికీ అర్ధం అయిపొయింది, ఒక హిట్ సినిమాని చూస్తున్నాం అని… సీన్ బై సీన్ ని ఎంజాయ్ చెయ్యడం మొదలు పెట్టారు. ఇంటర్వెల్ లో బయటకి వచ్చిన వాళ్ల మొహాలు సంతోషంతో వెలిగిపోయాయి. ఇక సెకండ్ హాఫ్ కూడా ఇదే రేంజులో ఉంటే ఎన్టీఆర్ హిట్ కొట్టేసినట్లే అనుకుంటూ సెకండ్ హాఫ్ చూడడానికి థియేటర్ లోకి ఎన్టీఆర్ అయ్యారు. ఫస్ట్ హాఫ ప్రకృతి అయితే సెకండ్ హాఫ్ ప్రళయం. ఎన్టీఆర్ నట విశ్వరూపం చూపించాడు, ముఖ్యంగా క్లైమాక్స్ లో ఎన్టీఆర్ విద్వంసం సృష్టించాడు. థియేటర్ లో కూర్చున్న ఆడియన్స్ కి ఎన్టీఆర్ మాటలు లేకుండా చేశాడు. చివరి 20 మినిట్స్ లో ఇది కదరా ఎన్టీఆర్ అంటే, ఇది కదరా మేము కోరుకునేది, ఇది కదా పూరి రైటింగ్ రేంజ్, రేయ్ వక్కంతం వంశీ ఏం కథ ఇచ్చావ్ రా అని ఫీల్ అవ్వని సినీ అభిమాని లేడు. మార్నింగ్ షోస్ అయిపోయాయి ఎన్టీఆర్ హిట్ కొట్టేసాడు. ఈరోజున సరిగ్గా తొమ్మిదేళ్ల క్రితం రెండు జరిగాయి, ఎన్టీఆర్ ఫ్లాప్ స్ట్రీక్ బ్రేక్ అయ్యింది, ఎన్టీఆర్ హిట్ స్ట్రీక్ హిస్టరీ మొదలయ్యింది. ఇక్కడి నుంచి ఎన్టీఆర్ వెనక్కి తిరిగి చూడలేదు, ఇచ్చిన మాట తప్పలేదు. 2015 నుంచి 2024 వరకూ టిల్ డేట్ నందమూరి అభిమానులు ఎత్తిన కాలర్ ని దించలేదు, ఎన్టీఆర్ తన హిట్ స్ట్రీక్ ని బ్రేక్ చెయ్యలేదు. 2023లో చిన్న గ్యాప్ ఇస్తున్నాడు, 2024లో దేవర సినిమాతో ఎన్టీఆర్ మళ్లీ బాక్సాఫీస్ పై దండయాత్ర చేస్తాడు, ఈసారి పాన్ ఇండియా స్థాయిలో… అప్పుడు ఎన్టీఆర్ అనే పేరు మరోసారి రీసౌండ్ వచ్చే రేంజులో వినిపిస్తుంది. ఎన్టీఆర్ ఈరోజు ఉన్న పరిస్థితికి కారణం అయిన టెంపర్ సినిమాని ఎన్టీఆర్ ఫాన్స్ ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటారు. మాస్ హీరోని Man of The Masses గా మార్చిన టెంపర్ సినిమా టాలీవుడ్ హిస్టరీలో కూడా చిరస్థాయిగా నిలిచి పోతుంది, ఒక వ్యక్తి సర్వైవల్ లో బెస్ట్ కంబ్యాక్ గా నిలిచిపోతుంది.