Dragon Glimpse Review: ప్రశాంత్ నీల్ ఊరమాస్ ఎలివేషన్స్ ఓకే.. కానీ ఎన్టీఆర్ లుక్కే అలా ఉందేంటి? ‘డ్రాగన్’ గ్లింప్స్ రివ్యూ!

Dragon Glimpse

Dragon Glimpse

Dragon Glimpse Review: గ్లోబల్ స్టార్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ – సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘డ్రాగన్’ (#Dragon). యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌తో పాటు సినిమా ప్రియులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ఇది. కేజీఎఫ్, సలార్ చిత్రాలతో ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ప్రశాంత్ నీల్.. ఎన్టీఆర్‌ను ఎలా చూపించబోతున్నాడనే దానిపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్న క్రమంలో ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఒక రోజు ముందుగానే మే 19న మేకర్స్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ గ్లింప్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. అయితే ఇదే సమయంలో ఆ గ్లింప్స్ చూసిన తర్వాత అటు ఇండస్ట్రీ వర్గాల్లో, ఇటు సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన చర్చ మొదలైంది. ప్రశాంత్ నీల్ మార్క్ ఎలివేషన్స్ అదిరిపోయినప్పటికీ.. ఎన్టీఆర్ లుక్స్ ఆశించిన స్థాయిలో లేవా? అవేమైనా సినిమా హైప్‌ను దెబ్బతీసేలా ఉన్నాయా? అనే కోణంలో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి.

ప్రశాంత్ నీల్ ఊరమాస్ మార్క్.. కానీ
సాధారణంగా ప్రశాంత్ నీల్ తన సినిమాల్లో హీరోలను చాలా రగ్గడ్‌గా, డార్క్‌ అండ్‌ డస్టీ షేడ్స్‌లో చూపిస్తుంటాడు. ‘డ్రాగన్’ గ్లింప్స్‌లోనూ ఆయన అదే ఎలివేషన్‌ను కంటిన్యూ చేశాడు. ఎన్టీఆర్ వైల్డ్ ఎనర్జీ, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, నీల్ మార్క్ మేకింగ్ స్టైల్ టాప్‌లో ఉన్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. థియేటర్లలో ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోయే రేంజ్‌లోనే ఈ గ్లింప్స్ కట్ ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. కానీ గ్లింప్స్‌లో కనిపించిన ఎన్టీఆర్ హెయిర్ స్టైల్, కాస్ట్యూమ్స్, ఫేషియల్ లుక్స్‌పై మాత్రం సినీ ప్రియుల నుంచే కాకుండా, ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ నుంచి కూడా మిశ్రమ స్పందన వస్తోంది. ‘ఆర్ఆర్ఆర్’ లో కొమరం భీమ్‌గా, ఆ తర్వాత వచ్చిన ‘దేవర’లో పవర్‌ఫుల్ లుక్స్‌తో మెప్పించిన ఎన్టీఆర్‌ను.. డ్రాగన్‌ కోసం ప్రశాంత్ నీల్ తన స్టైల్‌కు తగ్గట్టుగా మార్చే క్రమంలో యంగ్ టైగర్ ఒరిజినల్ చార్మ్ కొద్దిగా మిస్సయిందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని సీన్లలో ఎన్టీఆర్ లుక్ కొంచెం డిఫరెంట్‌గా, గతంలో ఎప్పుడూ చూడని విధంగా ఉండటమే ఈ చర్చకు ప్రధాన కారణం.

ఈ గ్లింప్స్ రిలీజ్ అయిన వెంటనే సోషల్ మీడియా రెండుగా చీలిపోయింది. ఎన్టీఆర్ డైహార్డ్ ఫ్యాన్స్ ఇది ఊరమాస్ అవతార్ అంటూ కామెంట్స్ చేయడం స్టార్ట్ చేశారు. ప్రశాంత్ నీల్ సినిమాల్లో హీరోలు డిఫరెంట్ లుక్‌లో ఉండటం కామనేనని, కథ డిమాండ్ మేరకే ఎన్టీఆర్‌ను అలా వైల్డ్‌గా చూపించారని చెబుతున్నారు. ‘డ్రాగన్’ అంటేనే ఒక వినాశకరమైన పాత్ర అని, దానికి ఈ లుక్ వంద శాతం సరిపోతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కానీ సాధారణ ప్రేక్షకుల వర్షన్ మాత్రం ఇంకా బెటర్‌గా ఉండాల్సిందనే కామెంట్స్ చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ తన పాత సినిమాల (కేజీఎఫ్, సలార్) టెంప్లేట్‌నే దీనికి కూడా వాడేశాడని, ఎన్టీఆర్ లుక్‌పై మరింత శ్రద్ధ పెట్టాల్సిందని కామెంట్స్ వినిపిస్తున్నాయి.

లుక్స్ పరంగా చిన్నపాటి చర్చ నడుస్తున్నప్పటికీ, ‘డ్రాగన్’ గ్లింప్స్ క్రియేట్ చేసిన హైప్ మాత్రం పీక్స్‌లో ఉంది. ప్రశాంత్ నీల్ రాసుకున్న కథలో ఎన్టీఆర్ నటన, యాక్షన్ ఎపిసోడ్స్ థియేటర్లను షేక్ చేయడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కేవలం ఈ గ్లింప్స్‌తోనే సినిమా రేంజ్ ఏంటో తెలిసిపోయిందని, లుక్స్ అనేవి కేవలం స్టార్టింగ్ ట్రోల్స్‌కు మాత్రమే పరిమితం అవుతాయని, రేపు థియేటర్లలో ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ ముందు ఇవేవీ నిలబడవని సినీ పండితులు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా, లుక్స్ దెబ్బేశాయా? లేక ఇదే సినిమాలో మైండ్ బ్లాక్ చేసే రేంజ్ సర్‌ప్రైజా? అనేది పూర్తి ట్రైలర్ వస్తే కానీ క్లారిటీ రాదు.