Site icon NTV Telugu

NTR: ఎరుపెక్కిన సంద్రం… తెప్పల్లో తెగిపడిన తలలు

Ntr

Ntr

ఓ వైపు భయంకరమైన మృగాలు.. మరో వైపు తుఫాన్‌లా ఎగిసిపడుతున్న అలలు.. ఈ రెండింటి మధ్యన రక్తం చిందిస్తున్న కత్తి… ఆ కత్తి చివరన భయానికే భయం పుట్టించేలా ఉన్నాడు దేవర. ఇప్పటి వరకు చరిత్రలో తీర ప్రాంతాల్లో ఎప్పుడు జరగనటువంటి యుధ్దం జరుగుతోంది. సముద్ర వీరుడికి, మృగాలకు జరిగిన భీకర పోరుకు సంద్రం ఎరుపెక్కింది. తెగిపడిన తలలతో తెప్పలు తీరానికి కొట్టుకొస్తున్నాయి. అసలు ఇలాంటి యుధ్దం ఇప్పటి వరకు స్క్రీన్ పై చూసి ఉండరు అనేలా దేవర సినిమాను తెరకెక్కిస్తున్నాడు కొరటాల శివ. బిగ్ ఎమోషన్, బిగ్ యాక్షన్‌తో బౌండరీస్ దాటేందుకు పెద్ద యుద్దమే చేస్తున్నారు ఎన్టీఆర్, కొరటాల శివ. జనతా గ్యారేజ్ తర్వాత పాన్ ఇండియా బాక్సాఫీస్ బద్దలు కొట్టేందుకు రెడీ అవుతోంది ఎన్టీఆర్, కొరటాల కాంబినేషన్. ప్రీ ప్రొడక్షన్ కోసం చాలా టైం తీసుకున్న కొరటాల, షూటింగ్ స్టార్ట్ చేయడమే లేట్ అన్నట్టు పక్కా ప్లానింగ్‌తో దేవరను పరుగులు పెట్టిస్తున్నాడు.

ఇప్పటికే ఐదారు భారీ యాక్షన్ షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకున్న దేవర… ఇప్పుడు మరో భారీ షెడ్యూల్‌ స్టార్ట్ చేశారు. ఓ షార్ట్ బ్రేక్‌ తర్వాత.. కొన్ని రోజుల రిహార్సల్స్ తర్వాత… భారీ స్థాయిలో యాక్షన్‌ సీక్వెన్స్ తీసేందుకు సెట్స్ పైకి తిరగొచ్చాం అంటూ దేవర టీం ట్వీట్ చేసింది. తెప్పల్లో తలలు నరికేందుకు దేవర వస్తున్నట్టుగా ఓ పిక్‌ను షేర్ చేసుకున్నారు. ఈ షెడ్యూల్‌లో సముద్రంలో భారీ యాక్షన్ సీక్వెన్స్‌ చిత్రీకరించనున్నారు. దీంతో సినిమాలో ఇది మరో బిగ్గెస్ట్ యాక్షన్ సీక్వెన్స్ అని చెప్పొచ్చు. ఇప్పటి వరకు జరిగిన అన్నీ షెడ్యూల్స్‌లోను యాక్షన్ సీక్వెన్స్‌లే షూట్ చేశారు. గ్రాఫిక్స్ వర్క్ కోసం ముందుగా యాక్షన్‌ సీన్స్ కంప్లీట్ చేస్తున్నారు. ఆ తర్వాత టాకీ పార్ట్ షూట్‌ చేయనున్నారు. ఏప్రిల్ 5న దేవర రిలీజ్‌కు రెడీ చేస్తున్నారు.

Exit mobile version