NTV Telugu Site icon

NTR: బ్లాక్ సూట్ లో ఎన్టీఆర్.. ఆస్కార్ కోసమేనా..?

Ntr

Ntr

NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ పేరు సోషల్ మీడియాలో మారుమ్రోగిపోతోంది. ఆస్కార్స్ లో ఎన్టీఆర్ పేరు ఉంటుందని ఎన్టీఆర్ అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్, కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు. శరవేగంగా ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకొంటుంది. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇక తాజాగా ఎన్టీఆర్ న్యూ ఫోటోషూట్ నెట్టింట వైరల్ గా మారింది. బ్లాక్ అండ్ బ్లాక్ సూట్ లో ఎన్టీఆర్ రాజసం అదిరిపోయింది. ఇక ఈ ఫోటోషూట్ ఆస్కార్ కోసమే అంటున్నారు అభిమానులు. ఈ డ్రెస్ చూస్తుంటే ఆస్కార్ స్టేజిపై ప్రముఖులు వేసుకొనే సూట్ లానే అనిపిస్తోందని, ఖచ్చితంగా ఆస్కార్, ఎన్టీఆర్ అందుకుంటాడని చెప్పుకొస్తున్నారు.

ఇక మరికొందరు బిగ్ బాస్ కోసమని చెప్పుకొస్తున్నారు. సీజన్ 7 కు నాగ్ హోస్ట్ చేయడం లేదని వార్తలు వస్తున్నాయి. దీంతో బాలయ్య కానీ, ఎన్టీఆర్ కానీ సీజన్ 7 కు హోస్ట్ గా వ్యవహరిస్తున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరి అందుకోసం కూడా ఈ ఫోటోషూట్ జరిగి ఉండొచ్చని చెప్పుకొస్తున్నారు. ఇక ఈ రెండు కాకపోతే ఏదైనా బ్రాండ్ ను ప్రమోట్ చేయడానికి ఎన్టీఆర్ ఈ అవతారంలో మెరిసి ఉంటాడని చెప్పుకొస్తున్నారు. ఏదిఏమైనా ఈ లుక్ లో ఎన్టీఆర్ మాత్రం కేక పెట్టిస్తున్నాడు.. ఏమున్నాడురా బాబు అని అమ్మాయిలు కామెంట్స్ పెట్టుకొస్తున్నారు. మరి ఈ ఫోటోషూట్ వెనుక కథ ఏంటి అని తెలియాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే.

Show comments