NTV Telugu Site icon

NTR Neel: ట్రెండ్ కి భిన్నంగా ఎన్టీఆర్ – నీల్ సినిమా?

Ntr Neel

Ntr Neel

NTR Neel: జూనియర్ ఎన్టీఆర్ ఈమధ్యే కొరటాల శివతో దేవర అనే సినిమా చేసి హిట్ కొట్టాడు. ముందు మిశ్రమ స్పందన తెచ్చుకున్నా ఫైనల్ గా హిట్ టాక్ తో దూసుకు పోతోంది. ఇక ఈ సినిమా పూర్తయిన నేపద్యంలో ఇప్పుడు ఎన్టీఆర్ తన తదుపరి చిత్రం మీద ఫోకస్ పెట్టాడు. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమా చేయాల్సి ఉంది. ఇప్పటికీ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఇక ఈ సినిమాకి సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త తెర మీదకు వచ్చింది. ప్రస్తుతానికి దాదాపుగా అన్ని సినిమాలను అయితే రెండు భాగాలుగా లేదా వీలైతే ఫ్రాంచైజ్ గా మార్చేచేందుకు ఎక్కువ మేకర్స్ ఆసక్తి చూపిస్తున్నారు.

Also Read: National Film Awards: బెస్ట్ తెలుగు సినిమాగా కార్తికేయ 2.. బెస్ట్ యాక్టర్ గా రిషబ్ శెట్టి

కానీ ఈ సినిమా విషయంలో అలాంటి ప్రయోగాలు ఏవి చేయకుండా పూర్తిగా ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా ఒక్క భాగానికి మాత్రమే పరిమితం అయ్యేలాగా ఒక్క కథగా ఉండేలా మాత్రమే ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. ప్రజెంట్ నడుస్తున్న ట్రెండుకు భిన్నంగా ఈ నిర్ణయం తీసుకున్నారని, కావాలని ఇలా ఒక సినిమా చేయాలని ఉద్దేశంతోనే ఈ మేరకు ముందుకు వెళ్తున్నారని చెబుతున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనేది ఇప్పటివరకు ఫైనల్ కాలేదు కానీ కన్నడ భామ రుక్మిణి వసంతను ఎంపిక చేస్తున్నారని ప్రచారం అయితే జరుగుతోంది. అందులో నిజా నిజాలు ఎంతవరకు ఉన్నాయి అనేది తెలియాల్సి ఉంది.

Show comments