దర్శక ధీరుడు రాజమౌళి రికార్డులని బ్రేక్ చెయ్యాలి అంటే రాజమౌళి సినిమానే రిలీజ్ అవ్వాలి. అలాంటిది రాజమౌళి బాక్సాఫీస్ లెక్కల్ని రెండో సినిమాతోనే టచ్ చేసాడు ప్రశాంత్ నీల్. KGF ఫ్రాంచైజ్ తో కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీని పాన్ ఇండియాకి పరిచయం చేసాడు ప్రశాంత్ నీల్. రాఖీ భాయ్ క్యారెక్టర్ ని ప్రశాంత్ నీల్ ప్రెజెంట్ చేసిన విధానం, కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ బ్యాక్ డ్రాప్ ని ప్రశాంత్ నీల్ ఎలివేట్ చేసిన విధానానికి ప్రతి ఒక్కరు ఫిదా అయ్యారు. డైలాగ్స్, యాక్షన్ ఎపిసోడ్స్ ఇలా ఒకటేంటి… KGF ఫ్రాంచైజ్ లో ప్రతి ఫ్రేమ్ కి విజిల్స్ పడ్డాయి. ఇప్పుడు ప్రశాంత్ నీల్ కి ప్రభాస్ కలిసాడు, ఈ ఇద్దరి కాంబినేషన్ లో సలార్ సినిమా వస్తుంది. KGF సాంపిల్ మాత్రమే సలార్ ప్రశాంత్ నీల్ నుంచి రాబోతున్న బిగ్గెస్ట్ ఫిల్మ్ అయ్యేలా ఉంది.
హాలీవుడ్ సినిమాలకి మాత్రమే వాడే డార్క్ సెంట్రిక్ థీమ్ తో సలార్ సినిమాని తెరకెక్కించిన ప్రశాంత్ నీల్… సలార్ మూవీతో చాలా బాక్సాఫీస్ రికార్డులపై కన్నేసాడు. సలార్ ప్రశాంత్ నీల్ కి నాలుగో సినిమా మాత్రమే, నాలుగు సినిమాలకి మాత్రమే ఈ రేంజ్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు ప్రశాంత్ నీల్. డైరెక్టర్ గా సూపర్ క్రేజ్ మైంటైన్ చేస్తున్న ప్రశాంత్ నీల్ తన సినిమాలని మామూలుగానే ఇప్పటివరకూ ఎవరూ చూడని మాస్ లెవల్లో చూపిస్తాడు. అలాంటిది తన డ్రీమ్ ప్రాజెక్ట్ చేసే ఛాన్స్ వస్తే ఆ సినిమా ఎలా ఉంటుందో, దాన్ని ప్రశాంత్ నీల్ ఏ రేంజులో తీస్తాడో ఊహించడం కూడా కష్టమే. ఎన్టీఆర్ 31 అలాంటి సినిమానే, ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కలిసి చేయబోయే ఈ సినిమా కంప్లీట్ గా ఓవర్సీస్ లో తెరకెక్కుతుందట. ప్రశాంత్ నీల్ చాలా సార్లు ఎన్టీఆర్ 31 తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పాడు మరి ఎలాంటి సెటప్ లో సినిమా తెరకెక్కుతుంది అనేది చూడాలి.