Dragon: ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో బాలీవుడ్ స్టార్స్.. ఆలియా భట్, షాహిద్ కపూర్ స్పెషల్ రోల్స్‌లో?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dragon: యంగ్ టైగర్ ఎన్టీఆర్ నుంచి సినిమా అంటేనే భారీ హైప్ ఉంటుంది. ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘డ్రాగన్’ కి కూడా బజ్ ఓ రేంజ్ లో క్రియేట్ అవుతోంది. అయితే ఇప్పుడు ఈ హై ఆక్టేన్ యాక్షన్ డ్రామా షూటింగ్‌కు ఎన్టీఆర్ భుజానికి గాయం కారణంగా తాత్కాలికంగా బ్రేక్ పడింది. త్వరలోనే షూటింగ్ తిరిగి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా గురించి ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఎన్టీఆర్‌తో పాటు ఇద్దరు బాలీవుడ్ స్టార్ హీరోహీరోయిన్లు కూడా సినిమాలో కనిపించబోతున్నారనే ప్రచారం మొదలైంది. ఇంతకీ వాళ్లెవరు? నిజంగానే ఈ భారీ చిత్రంలో స్పెషల్ రోల్స్ చేస్తున్నారా?
తాజా మీడియా కథనాల ప్రకారం బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్, స్టార్ హీరోయిన్ అలియా భట్ ఈ సినిమాలో ప్రత్యేక పాత్రల్లో కనిపించనున్నట్లు సమాచారం. అయితే ఈ వార్తకు సంబంధించి ఇప్పటివరకు మేకర్స్ నుంచి ఆఫీషియల్ గా ప్రకటన అయితే రాలేదు. ఒకవేళ ఈ వార్త నిజమైతే మాత్రం ‘డ్రాగన్’పై ఉన్న క్రేజ్ మరింత పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌పై భారీ అంచనాలు ఉండగా, ఇప్పుడు బాలీవుడ్ నుంచి షాహిద్ కపూర్, అలియా భట్ పేర్లు వినిపించడం ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఇప్పుడు మరింత హాట్ టాపిక్ అవుతోంది.
Also Read
- Jim Jim Thara: లీకై వైరల్ అయిన ‘జిమ్ జిమ్ తార’ పాట వెనుక అసలు గుట్టు ఇదే!
- Chiranjeevi: మెగాస్టార్‌కు కార్తీక్ సుబ్బరాజ్ మార్క్ కథ నరేషన్.. కానీ హోల్డ్?
- Mythri Ravi: "రూ. 2 కోట్లతో తీస్తే రూ. 400 కోట్లా? మాకు ఇది చెంపపెట్టు"
- Sivakarthikeyan: ఫ్యాన్స్‌కు శివకార్తికేయన్ ఇచ్చిన ఆ ఒక్క సలహా.. నెట్టింట వీడియో వైరల్!
అయితే అలియా భట్‌కు ఎన్టీఆర్‌తో ఇది మొదటి కాంబినేషన్ మాత్రం కాదు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో వీరిద్దరూ కలిసి నటించారు. రాజమౌళి తెరకెక్కించిన ఆ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో కనిపించగా, ఆలియా భట్ కీలకమైన పాత్రలో నటించింది. ఆ సినిమా ద్వారా ఎన్టీఆర్, ఆలియా మధ్య మంచి స్క్రీన్ కెమిస్ట్రీ వర్కౌట్ అయింది. ఇప్పుడు ‘డ్రాగన్’లో మరోసారి ఈ ఇద్దరూ కలిసి కనిపించబోతున్నారనే వార్త నిజమైతే అభిమానులకు ఇది మరోసారి ప్రత్యేకమైన ట్రీట్‌గా మారనుంది.
మరోవైపు షాహిద్ కపూర్ పేరు ఈ ప్రాజెక్ట్‌తో వినిపించడంతో ప్రశాంత్ నీల్ యాక్షన్ వరల్డ్‌లో అతను ఎలాంటి పాత్రలో కనిపిస్తాడనే ప్రశ్న ఇప్పుడు అభిమానుల్లో మొదలైంది. అయితే ఆయన పాత్ర ఎంతసేపు ఉంటుంది, కథలో దాని ప్రాధాన్యత ఏమిటి, ఎన్టీఆర్‌తో నేరుగా స్క్రీన్ షేర్ చేసుకుంటారా అనే వివరాలు మాత్రం ప్రస్తుతానికి తెలియాల్సి ఉంది.
ఇక ‘డ్రాగన్’లో హీరోయిన్గా రుక్మిణి వసంత్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు అలియా భట్, షాహిద్ కపూర్ వంటి బాలీవుడ్ నటులు ప్రత్యేక పాత్రల్లో కనిపిస్తారనే ప్రచారం సినిమాకు మరింత హైప్ తీసుకొస్తోంది. ప్రస్తుతం ఎన్టీఆర్ గాయం కారణంగా షూటింగ్‌కు విరామం ఏర్పడినప్పటికీ, త్వరలోనే షూటింగ్ కు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. షూటింగ్ షెడ్యూల్స్‌తో పాటు నటీనటుల విషయంలోనూ మరిన్ని వివరాలు క్రమంగా బయటకు వచ్చే అవకాశం ఉంది.
ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌కే భారీ క్రేజ్ ఉన్న సమయంలో మరో ఇద్దరు బాలీవుడ్ స్టార్ల పేర్లు వినిపించడం ‘డ్రాగన్’పై అంచనాలను మరింత పెంచుతోంది. అయితే ఈ కాంబినేషన్ నిజమేనా లేదా కేవలం ఇండస్ట్రీ రూమరేనా అనేది మేకర్స్ అధికారికంగా ప్రకటించే వరకు వేచి చూడాల్సిందే. ఒకవేళ ఆలియా, షాహిద్ ఇద్దరూ సినిమాలో భాగమైతే మాత్రం ‘డ్రాగన్’ టాలీవుడ్లోనే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో మరింత క్రేజీ ప్రాజెక్ట్‌గా మారే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Jim Jim Thara: లీకై వైరల్ అయిన ‘జిమ్ జిమ్ తార’ పాట వెనుక అసలు గుట్టు ఇదే!
-
Delhi: ఢిల్లీలో ఘోర ప్రమాదం.. కూలిన మూడు అంతస్తుల బిల్డింగ్
-
Chiranjeevi: మెగాస్టార్‌కు కార్తీక్ సుబ్బరాజ్ మార్క్ కథ నరేషన్.. కానీ హోల్డ్?
-
SIR Protest: ఢిల్లీలో ఉద్రిక్తత.. జంతర్ మంతర్ వద్ద నిరసనకు రాహుల్ గాంధీ, విపక్షాలు సిద్ధం!
-
Rahul Gandhi: ‘నా లక్ష్యం 100 ఎఫ్ఐఆర్లు’.. ఈసీకి వ్యతిరేకంగా ఆందోళన కొనసాగుతుందన్న రాహుల్‌గాంధీ
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!