NTV Telugu Site icon

NTR-Mokshagna: అన్నదమ్ముల అనుబంధం.. ఏం ఉన్నార్రా బాబు

Ntr

Ntr

NTR-Mokshagna:నందమూరి కుటుంబం.. జూనియర్ ఎన్టీఆర్ ను దూరం పెడుతున్నారు అని ఎప్పటి నుంచో సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్న విషయం తెల్సిందే. ప్రతి ఫంక్షన్ లోనూ బాలయ్య.. ఎన్టీఆర్ ను పట్టించుకోవడం లేదని, దానికి ఎన్టీఆర్ ఫీల్ అవుతున్నాడో లేదో కానీ, ఆయన అభిమానులు మాత్రం చాలా ఫీల్ అవుతున్నారు. ఆ వీడియోలను షేర్ చేస్తూ ఎన్ని బాధలు పడుతున్నావ్ ఎన్టీఆర్ అన్నా అని, ఎవరు లేకున్నా నీకు తోడుగా మేము ఉన్నామని ఓదారుస్తూ కామెంట్స్ పెడుతున్నారు. ఇక ఎన్టీఆర్ మాత్రం తన తండ్రి హరికృష్ణ మరణించాక బాలకృష్ణనే తన తండ్రిగా భావిస్తున్నట్లు ఎన్నోసార్లు చెప్పుకొచ్చాడు. నందమూరి కుటుంబం మొత్తం ఒకే మాట మీద ఉంటుందని చెప్పుకొచ్చాడు. అయితే ఇప్పటివరకు నందమూరి బ్రదర్స్.. కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ ను మాత్రమే కలిసి ఉండడం చూశారు అభిమానులు.

Kareena Kapoor: కరీనా కపూర్ వేసుకున్న ఈ డ్రెస్సు ధర ఎంతో తెలుసా?

ఇక నందమూరి బాలకృష్ణ- ఎన్టీఆర్- కళ్యాణ్ రామ్ ఎప్పుడైనా ఈవెంట్స్ లో అయినా కలిసి కనిపిస్తారు. కానీ, బాలయ్య కొడుకు మోక్షజ్ఞ తో ఎన్టీఆర్ కలిసి కనిపించింది లేదు. మొట్ట మొదటిసారి అందుకు వేదికగా మారింది నందమూరి సుహాసిని కొడుకు పెళ్లి. ఈ పెళ్ళిలో నందమూరి బ్రదర్స్ హైలైట్ గా నిలిచారు. ఇప్పటికే ఆ ఫొటోస్ నెట్టింట వైరల్ గా మారిన విషయం తెల్సిందే. ఇక తాజాగా మోక్షజ్ఞ- ఎన్టీఆర్ కౌగిలించుకున్న ఫోటో ఇంటర్ నెట్ ను షేక్ చేస్తోంది. అన్నదమ్ములు ఇద్దరు ఒకరినొకరు కౌగిలించుకొని నవ్వులు చిందిస్తూ కనిపించారు. ఇక ఈ ఫోటో చూసిన నందమూరి ఫ్యాన్స్ అన్నదమ్ముల అనుబంధం.. అంటే ఇలా ఉండాలి.. ఇద్దరు ఏం ఉన్నార్రా బాబు అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Show comments