JR NTR : జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రెండు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. వార్-2 సినిమా ఇప్పటికే చాలా వరకు షూటింగ్ కంప్లీట్ అయింది. దీని తర్వాత ఆయన ప్రశాంత్ నీల్ తో చేస్తున్న డ్రాగన్ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఈ మూవీ షూటింగ్ లో ఈ రోజే ఎన్టీఆర్ అడుగు పెట్టాడు. అయితే రీసెంట్ గా ఎన్టీఆర్ లుక్స్ చూసిన వారంతా షాక్ అవుతున్నారు. ఎందుకంటే ఎన్టీఆర్ బరువు భారీగా తగ్గిపోయాడు. చాలా సన్నబడ్డాడు. ఈ లుక్స్ గతంలో శక్తి మూవీ టైమ్ లో కనిపించింది. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఎన్టీఆర్ ఇంత సన్నగా మారిపోయాడు. అయితే ఈ బరువు తగ్గడం వెనక ప్రశాంత్ నీల్ ఉన్నాడంట. డ్రాగన్ సినిమా కోసం బరువు తగ్గాలని సూచించాడంట.
Read Also: LSG vs DC: హాఫ్ సెంచరీతో ఆదుకున్న మార్కరం.. ఢిల్లీ క్యాపిటల్స్ టార్గెట్ ఎంతంటే?
దీంతో ఎన్టీఆర్ ఐదు నెలలుగా చాలా వర్కౌట్లు చేసి సహజ సిద్ధంగానే బరువు తగ్గాడంట. ఈ సినిమాలో ఎన్టీఆర్ లుక్ చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని మూవీ టీమ్ చెబుతోంది. ఆ లుక్ ఇది వరకు సినిమాల కంటే చాలా డిఫరెంట్ గా ఉంటుందని సమాచారం. ఆ మూవీ కోసమే ఇలా బరువు తగ్గాడంట. ఈ సినిమా అయిపోయే వరకు ఇదే లుక్ ను, ఇదే కటౌట్ ను మెయింటేన్ చేయబోతున్నాడంట జూనియర్ ఎన్టీఆర్. ఈ సినిమాను ప్రస్తుతం కర్ణాటకలో షూట్ చేస్తున్నారు.
