ఆర్ ఆర్ ఆర్ సినిమాతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రేజ్ పాన్ ఇండియా మొత్తం స్ప్రెడ్ అయ్యింది. మరోసారి ఇండియన్ బాక్సాఫీస్ ని టార్గెట్ చేస్తూ ఎన్టీఆర్, కొరటాల శివతో కలిసి ఒక సినిమా చేస్తున్నాడు. ‘ఎన్టీఆర్ 30’ అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స్ పైకి వెళ్లిన ఈ మూవీ ఇటివలే గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ‘ఎన్టీఆర్ 30’ రెగ్యులర్ షూటింగ్ మార్చ్ 31న స్టార్ట్ అయ్యింది. ఎన్టీఆర్ సెట్స్ లోకి ఎంటర్ అవుతున్న సమయంలో వీడియో తీసి మేకర్స్ దాన్ని సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేశారు. కెన్నీ బేట్స్ ఆధ్వర్యంలో ఒక భారి యాక్షన్ ఎపిసోడ్ ని కొరటాల శివ షూట్ చేశాడు. దాదాపు వారం రోజుల పాటు జరిగిన ఈ యాక్షన్ ఎపిసోడ్ షూటింగ్ ఈరోజుతో కంప్లీట్ అవ్వనుంది. దీంతో ఎన్టీఆర్ 30 ఫస్ట్ షెడ్యూల్ సక్సస్ ఫుల్ గా కంప్లీట్ అవుతుంది.
Read Also: Akhira: నాన్న రాజకీయాల్లోకి, కొడుకు సినిమాల్లోకి… ఆరడుగుల బుల్లెట్ ఎంట్రీ ఎప్పుడు?
మొదటి షెడ్యూల్ లో హ్యూజ్ యాక్షన్ ఎపిసోడ్ ని, సముద్రం బ్యాక్ డ్రాప్ లో గ్రాండ్ స్కేల్ లో షూట్ చేశారని సమాచారం. సాబు సిరిల్ వేసిన సెట్ ఇండియన్ స్క్రీన్ పైన ఇప్పటివరకూ చూడని విధంగా ఉంటుందట. మే 20న ఎన్టీఆర్ పుట్టిన రోజు సంధర్భంగా ఈ ఫస్ట్ షెడ్యూల్ నుంచే ఫస్ట్ లుక్ ని రిలీజ్ చెయ్యడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఎన్టీఆర్ తో సెకండ్ సినిమా చేస్తున్న కొరటాల శివ ప్రతి విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నాడు. రాజమౌళితో సినిమా చేస్తే దని తర్వాత ఆ హీరో ఏ దర్శకుడితో సినిమా చేసినా అది ఫ్లాప్ అవుతుంది అనే నమ్మకం తెలుగు ఆడియన్స్ లో ఉంది. ఈ బాడ్ సెంటిమెంట్ మొదలయ్యింది ఎన్టీఆర్ తోనే, మరి తనతో మొదలైన ఈ సెంటిమెంట్ ని ఎన్టీఆర్ ఎండ్ కార్డ్ వేస్తాడేమో చూడాలి.