NTV Telugu Site icon

Koratala Shiva: ఎన్టీఆర్ ఒక్కడే కాపాడగలిగేది…

Koratala Shiva

Koratala Shiva

కమర్షియల్ సినిమాలకి సోషల్ కాజ్ అద్ది సరికొత్త సినిమాని తెలుగు ఆడియన్స్ కి పరిచయం చేసాడు కొరటాల శివ. మిర్చి, శ్రీమంతుడు, భరత్ అనే నేను, జనతా గ్యారేజ్… ఈ సినిమాల పేర్లు చూస్తే చాలు శివ నుంచి ఎలాంటి సినిమాలు వచ్చాయో అర్థమైపోతుంది. ఇవన్నీ హీరో… హీరోయిజం చుట్టూ తిరిగే కమర్షియల్ సినిమాలే అయినా కోర్ పాయింట్ మాత్రం సోషల్ కాజ్ ఉంటుంది. అందుకే ఆడియన్స్ కి కొరటాల శివ మిగిలిన దర్శకుల కన్నా కొత్తగా కనిపించాడు. ఇలాంటి కొరటాల శివని పాతాళానికి పడేసింది ఆచార్య. చిరు హీరోగా చరణ్ గెస్టు రోల్ లో నటించిన ఈ మూవీ కొరటాల శివని ఎవరు కలలో కూడా ఊహించనంత డౌన్ ఫాల్ లోకి తీసుకోని వెళ్లింది.

ఆచార్య రిలీజ్ అయిన రోజు నుంచి కొన్ని నెలల పాటు కొరటాల శివ అసలు బయట కనిపించకుండా పోయాడు అంటే ఆన్-లైన్ ఆఫ్-లైన్ లో ఎంత ట్రోలింగ్ ఫేస్ చేసాడో అర్ధం చేసుకోవచ్చు. చిరు లాంటి హీరోకి ఆచార్య లాంటి ఫ్లాప్ ఇచ్చిన తర్వాత, అంత నష్టాలని మిగిలించిన తర్వాత ఏ దర్శకుడికి అయినా ఇంకో సినిమా రావాలి అంటే చాలా సమయం పడుతుంది. ఇది చాలదన్నట్లు అప్పటికే ఓకే చేసిన సినిమాలు కూడా క్యాన్సిల్ అవుతాయి. ఇలా ఆచార్య రిలీజ్ సమయానికే కొరటాల శివ లిస్టులో ఇలా ఉన్న సినిమా ‘ఎన్టీఆర్ 30’. జనతా గ్యారేజ్ కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ, ఆర్ ఆర్ ఆర్ తర్వాత తనకి పాన్ ఇండియా హిట్ ఇచ్చే బాధ్యతని కొరటాల శివకి ఇచ్చాడు ఎన్టీఆర్.

ఇలాంటి సమయంలో ఆచార్య రిజల్ట్ చుసిన తర్వాత ‘ఎన్టీఆర్ 30’ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అవుతుందని అందరూ అనుకున్నారు. నందమూరి అభిమానులు సైతం కొరటాల శివతో ఇలాంటి సమయంలో సినిమా అవసరమా అన్నారు. ఎవరు ఎన్ని చెప్పినా ఎన్టీఆర్ మాత్రం కొరటాల శివని నమ్మాడు. కొరటాలకి కావాల్సినంత సమయం ఇచ్చాడు, ‘ఎన్టీఆర్ 30’ అప్డేట్ అడుగుతూనే ఉంటే సొంత అభిమానులపైనే సీరియస్ అయిన ఎన్టీఆర్… మేకర్స్ కి టైం ఇవ్వండి, కంగారు పెట్టకండి అని ఓపెన్ గా చెప్పాడు అంటే కొరటాలని ఎన్టీఆర్ ఎంత బ్యాంకింగ్ చేసాడో అర్ధం చేసుకోవచ్చు. ఎన్టీఆర్ కొరటాల శివపై పెట్టుకున్న నమ్మకం, ఎన్టీఆర్ కొరటాల శివకి ఇచ్చిన బ్యాకింగ్ ఈరోజు ‘ఎన్టీఆర్ 30’ని ‘దేవర’గా మార్చింది..

పాన్ ఇండియా మొత్తం ‘దేవర’ పోస్టర్ వైరల్ అయ్యేలా చేసింది. గ్లిమ్ప్స్ తో టాక్ ఆఫ్ ది టౌన్ గా దేవర మారింది. ఈ రెండు ప్రమోషనల్ కంటెంట్స్ తో కొరటాల శివ, తనపై వచ్చిన నెగిటివిటీ మొత్తం పోయేలా చేసాడు. ఇక ఇప్పుడు కొరటాలని కొత్త కష్టం కట్టి పడేస్తుంది. శ్రీమంతుడు కథ కాపీ కేసు కొరటాల శివని మళ్లీ హాట్ టాపిక్ గా మార్చింది. ఈ కాపీ కామెంట్స్, ఆచార్య నెగటివ్ ఫీడ్ బ్యాక్స్ చెరిగిపోవాలి అంటే… కొరటాల శివ హిట్ కొట్టాలి. తనని నమ్మిన ఎన్టీఆర్ కి పాన్ ఇండియా హిట్ ఇవ్వాలి… అప్పుడే కొరటాల శివ తిరిగి నిలబడగలడు లేదంటే కొరటాల శివ కెరీర్ కష్టాల్లో పడడం గ్యారెంటీ.