Kalki 2898AD: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రాలలో కల్కి 2898ఏడి ఒకటి. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా అశ్వినీదత్ ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ చిత్రాన్ని మొత్తం నాగ్ అశ్విన్ స్టార్ క్యాస్టింగ్ తో నింపేశాడు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకొనే నటిస్తుండగా.. కమల్ హాసన్ విలన్ గా నటిస్తున్నాడు. వీరే కాకుండా అమితాబచ్చన్, దిశా పటాని కీలకపాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ మధ్యకాలంలో ఈ సినిమా గురించిన అప్డేట్స్ రాలేదు కానీ, ఈ సినిమాకు సంబంధించిన రూమర్స్ మాత్రం రోజుకు ఒకటి వస్తూ ఉన్నాయి.
ఇప్పటికే ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటితో పాటు దర్శకుడు రాజమౌళి అతిథి పాత్రల్లో కనిపిస్తుండగా న్యాచురల్ స్టార్ నాని కృపాచార్యుడిగా కనిపించనున్నాడని వార్తలు వచ్చాయి. మహాభారతంలో కౌరవులకు, పాండవులకు గురువుగా.. సప్త చిరంజీవులలో ఒకడిగా కృపాచార్యుడుకి ఎంతో విశిష్టత ఉంది. అలాంటి పాత్రలో నాని కనిపించనున్నాడనే వార్త ఆసక్తికరంగా మారింది. అయితే నాని, విజయ్ దేవరకొండ .. నాగ్ అశ్విన్ మొదటి సినిమా ఎవడే సుబ్రహ్మణ్యం చిత్రంలో నటించారు కాబట్టి వారు క్యామియోలో కనిపించినా ఆశ్చర్యం లేదు. ఇకపోతే దీనికి మించిన ఒక రూమర్ ప్రస్తుతం నెట్టింట సెన్సేషన్ సృష్టిస్తుంది. అదేంటంటే ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ ఒక కీలక పాత్రలో కనిపించనున్నాడట. కల్కిలో తారక్ పరుశురాముడిగా కనిపించనున్నాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి. సప్త చిరంజీవులలో పరుశురాముడు కూడా ఒకడు. అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సప్త చిరంజీవులు కల్కిలో కనిపిస్తారట.. సప్త చిరంజీవుల కోసమే ఈ స్టార్ హీరోలను నాగ్ అశ్విన్ సెలెక్ట్ చేసినట్లు రూమర్ వినిపిస్తుంది. ఇక ఈ వార్త తెలియడంతో ఫ్యాన్స్.. అరేయ్ ఆశకు అయినా హద్దుండాలిరా.. ? అని కామెంట్స్ పెడుతున్నారు. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.
