Site icon NTV Telugu

SDT15: మెగా హీరోలను వదిలి నందమూరి హీరో సాయం అడిగిన మెగా మేనల్లుడు

Tej

Tej

SDT 15: మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ గతేడాది రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెల్సిందే. ఇక ఆరు నెలల రెస్ట్ తరువాత ఇప్పుడిప్పుడే తేజ్ షూటింగ్స్ లో పాల్గొంటున్నాడు. ప్రస్తుతం తేజ్ నటిస్తున్న చిత్రం SDT15. కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని బివిఎస్ ఎన్ ప్రసాద్, సుకుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో తేజ్ సరసన సంయుక్త మీనన్ నటిస్తోంది. చేతబడులు నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ ను మేకర్స్ అభిమానులతో ఎంచుకున్నారు. మెగా మేనల్లుడు మొదటిసారి మెగా ఫ్యామిలీని వదిలి నందమూరి హీరో సహాయం కోరాడు. అవును.. తేజ్ సినిమా కోసం ఎన్టీఆర్ రంగంలోకి దిగాడు.

SDT15 టీజర్ గ్లింప్స్ కు ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇస్తున్నాడు. ఈ విషయాన్నీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇదే విషయాన్ని తేజ్ చెప్తూ తారక్ కు ధన్యవాదాలు తెలిపాడు. ” తారక్.. నేను నీ వద్దకు వచ్చి ఈ విషయం గురించి అడిగినప్పుడు నువ్వు స్పందించిన తీరు అద్భుతం. థాంక్స్ అనేది ఒక చిన్నపదం. నటుడిగా నీ దగ్గరకు వచ్చినప్పుడు నాకు పాతరోజులు గుర్తొచ్చాయి. SDT15 టైటిల్ గ్లింప్స్ ని వాయిస్ తో మరింత అద్భుతంగా మారింది. తేజ్ కోసం ఎన్టీఆర్ ఎప్పుడు ప్రత్యేకంగా ఉంటుంది” అని రాసుకొచ్చాడు. ఇకపోతే ఈ గ్లింప్స్ డిసెంబర్ 7 ఉదయం 11 గంటలకు రిలీజ్ చేయనునున్నట్లు తెలిపాడు. దీంతో మెగా, నందమూరి ఫ్యాన్స్ ఈ గ్లింప్స్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

Exit mobile version